ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

దర్శనమిచ్చి ఆవిర్భవించిన సుబ్రహ్మణ్యుడు

Mon, Mar 09, 2015, 11:07 AM
Related Image సుబ్రహ్మణ్యస్వామి కొలువైన క్షేత్రాలు ఎంతో శక్తిమంతమైనవిగా ... మరెంతో మహిమాన్వితమైనవిగా తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి విశిష్టతను సొంతం చేసుకున్న క్షేత్రంగా 'శింగరాయపాలెం' కనిపిస్తుంది. కృష్ణాజిల్లా ముదినేపల్లి మండలంలో ఈ క్షేత్రం అలరారుతోంది. స్వామివారు ఇక్కడ స్వయంభువుగా ఆవిర్భవించిన తీరు, ఆ స్వామి ఇక్కడ ప్రత్యక్షంగా కొలువై వున్నాడనే విషయాన్ని స్పష్టం చేస్తూ వుంటుంది.

చాలాకాలం క్రితం ఈ ప్రదేశంలో దివ్యమైన తేజస్సును కలిగిన ఒక సర్పం ఒక భక్తుడికి కనిపించిందట. మిగతా సర్పాలకి భిన్నంగా ఈ సర్పం వుండటం ... అది చిత్రంగా ప్రవర్తించడం అతనికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆ సర్పం పొడవు .. అది పడగ విప్పి ఆడినతీరు ఆయన కనులముందే కదలాడసాగింది. ఆ సర్పం తనకి ఏదో చెప్పాలనుకుంటోందనీ, అయితే అదేమిటనేది తాను అర్థంచేసుకోలేక పోతున్నాననే విషయం మాత్రం ఆయన గ్రహించాడు.

ఆ రాత్రి స్వప్నంలో అతనికి సుబ్రహ్మణ్యస్వామి కనిపించి, తాను ఆ ప్రదేశంలో ఆవిర్భవించానని చెప్పాడట. ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలియపరిచి, ఇక మీదట అందరూ దర్శించుకునేలా ఏర్పాట్లు చేయమని సెలవిస్తాడు. తన దర్శనం చేసుకున్నవారికి ఆయురారోగ్యాలు ... అష్టైశ్వర్యాలు ... సంతాన సౌభాగ్యాలు కలుగుతాయని చెప్పి అదృశ్యమవుతాడు.

మరునాడు ఉదయాన్నే ఆ భక్తుడు ఈ విషయాన్ని మిగతావారికి తెలియజేస్తాడు. ఆ రోజు నుంచే ఇక్కడ పూజలు ఆరంభ్యమయ్యేలా చేస్తాడు. ఆ తరువాత ఇక్కడ స్వామివారు చూపిస్తూ వచ్చిన మహిమల కారణంగా భక్తులలో విశ్వాసం మరింతగా బలపడుతూ వచ్చింది. అదే స్థాయిలో ఆలయం అభివృద్ధి చెందుతూ వచ్చింది. స్వామివారు ఎంతగా సత్యాన్ని చూపిస్తాడనే విషయం ఇక్కడ మొక్కుబడులు చెల్లించుకునే భక్తులను చూస్తే తెలిసిపోతుంది.

ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన నాగదోషం తొలగిపోవడమే కాకుండా, మనోభీష్టం తప్పక నెరవేరుతుందని భక్తులు బలంగా చెబుతుంటారు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఆ స్వామిని దర్శించి .. పాలు - పండ్లు నైవేద్యంగా సమర్పించి ఆశీస్సులు అందుకుంటూ వుంటారు. ఆ స్వామి అనుగ్రహంతో ఆశించిన ఫలితాలను పొందుతుంటారు.
X

Feedback Form

Your IP address: 54.204.108.121