ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

శివకేశవ సంబంధమైన ఫాల్గుణ పౌర్ణమి

Wed, Mar 04, 2015, 04:32 PM
Related Image హోలీ అంటే రంగులపండుగ ... జీవితంలోని సంతోషాలకీ ... సంబరాలకి రంగులు సంకేతంగా చెబుతుంటారు. ఈ రోజున ఏవీధిలో చూసినా రంగులు ... రంగు కలిపిన నీళ్లు చల్లుకుంటూ వుంటారు. పిల్లలతో పాటు పోటీపడుతూ పెద్దలు కూడా ఈ పండుగలో ఉత్సాహంగా పాల్గొంటూ వుంటారు. ఒకరిపట్ల ఒకరికి గల ప్రేమాభిమానాలను ఆవిష్కరించేదిగా ఈ పండుగ కనిపిస్తూ వుంటుంది.

ఉత్సాహానికి ఉదాహరణగా కనిపించే ఈ 'ఫాల్గుణ పౌర్ణమి' శివకేశవుల లీలావిశేషాలకు వేదికగా అనిపిస్తుంది. ధర్మసంస్థాపనార్థం శ్రీమన్నారాయణుడు కృష్ణుడుగా జన్మించాడు. అలా జన్మించిన చిన్నికృష్ణుడిని ఈ రోజునే ఊయలలో వేసినట్లు ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే కొన్నిప్రాంతాల్లో ఈ రోజున బాలకృష్ణుడికి 'డోలోత్సవం' పేరుతో వేడుక జరుపుతుంటారు. పసివాడైన పరమాత్ముడిని ఊయలలో ఊపే ఈ ఉత్సవం నయన మనోహరంగా ఉంటుంది.

ఇక ఫాల్గుణ శుద్ధ చతుర్దశి రోజున తనపై మన్మథ బాణాలు సంధించిన మన్మథుడిని పరమశివుడు తన మూడవ కంటితో దహించివేస్తాడు. లోకకల్యాణం కోసమే తన భర్త ఆ పని చేసినట్టు మన్మథుడి భార్య రతీదేవి మొరపెట్టుకోగా, ఇకమీదట శరీరం లేనివాడిగానే ఆయన తిరుగుతాడంటూ ఫాల్గుణ పౌర్ణమి రోజున పునర్జీవితుడిని చేస్తాడు. ఈ ఆనందంతోనే ఈ రోజుని 'కాముని పున్నమి' పేరుతో జరుపుకుంటూ .. రంగులు చల్లుకుంటూ వుంటారు.

ఇలా ఫాల్గుణ పౌర్ణమి శివకేశవ సంబంధమైనదిగా కనిపిస్తుంది. అందువల్లనే ఈ రోజున సదాశివుడినీ ... కృష్ణ భగవానుడిని పూజించాలని చెప్పబడుతోంది. ఈ విధంగా చేయడం వలన సకల శుభాలు చేకూరతాయని స్పష్టం చేయబడుతోంది.
X

Feedback Form

Your IP address: 54.205.176.107