ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

లక్ష్మీదేవి అనుగ్రహాన్ని అందించే తీర్థం

Tue, Feb 24, 2015, 09:00 PM
Related Image తిరుమల తిరుపతి భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి స్వామి శ్రీనివాసుడుగా ... వేంకటేశ్వరుడుగా ... బాలాజీగా ... ఏడుకొండలవాడిగా భక్తులను అనుగ్రహిస్తూ వుంటాడు. స్వామివారు కొలువైన ఈ ప్రదేశం సాక్షాత్తు వైకుంఠం నుంచి దిగివచ్చినదిగా చెప్పబడుతూ ఉన్నందువలన, ఈ క్షేత్రంలో అడుగుపెట్టడమే పూర్వజన్మలో చేసుకున్న పుణ్యఫలితంగా భక్తులు భావిస్తుంటారు.

కొండలు ... లోయలు ... వృక్షాలు ... జలపాతాలు ... తీర్థాలతో, ఆహ్లాదాన్ని కలిగించే మనోహరమైన దృశ్యరూపంగా ఈ క్షేత్రం దర్శనమిస్తుంది. ఒకవైపున స్వామివారి లీలావిశేషాలు ... మరోవైపున ఆయన సంకల్పం కారణంగా ఏర్పడిన తీర్థాలు భక్తులకు అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తూ వుంటాయి. అడుగడుగునా పవిత్రతను ఆవిష్కరించే ఈ దివ్యతీర్థాలలో, ప్రతి తీర్థం కూడా తనదైన విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంటుంది.

అలాంటి తీర్థాలలో 'ఫల్గుణి తీర్థం' ఒకటి. పాపనాశానానికి ఈశాన్యభాగంలో గల ఈ తీర్థం, ఎంతో మహిమాన్వితమైనదిగా స్థలపురాణం చెబుతోంది. వశిష్ఠ మహర్షి భార్య అయిన అరుంధతి ఈ తీర్థం దగ్గర తపస్సు చేయగా, ఇందులో నుంచి లక్ష్మీదేవి వచ్చి దర్శనమిచ్చినట్టుగా చెప్పబడుతోంది. అరుంధతి తపస్సుకు మెచ్చి అమ్మవారు దర్శనమిచ్చిన ఆ రోజు .. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి. అందువల్లనే ఈ తీర్థానికి 'ఫల్గుణి' అనే పేరు వచ్చింది. ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున ఈ తీర్థములో స్నానమాచరించడం వలన మనోభీష్టాలు నెరవేరతాయనీ, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని అంటారు.
X

Feedback Form

Your IP address: 54.147.196.37