ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వాయులింగం

Tue, Jun 25, 2013, 02:54 PM
Related Image కంచిలో 'పృథ్వీ లింగం' ... చిదంబరంలో 'ఆకాశలింగం' ... జంబుకేశ్వరంలో 'జలలింగం' ... తిరువణ్నామలై లో 'తేజోలింగం' ... శ్రీ కాళహస్తిలో 'వాయులింగం' పంచభూత లింగాలుగా చెప్పబడ్డాయి. ఈ పంచభూత లింగాలు ఎంతో విశిష్టమైనవిగా ... మరెంతో మహిమాన్వితమైనవిగా ప్రసిద్ధి చెందాయి.

సాధారణంగా ఏ దేవాలయంలోను గర్భాలయంలోకి గాలి రావడానికి అవకాశముండదు. ఆగమ శాస్త్రం మేరకు గర్భగుడి నిర్మాణాన్ని అలాగే చేస్తారు. అందువల్లనే శ్రీ కాళహస్తీశ్వర స్వామి గర్భాలయంలోకి కూడా ఏ మాత్రం గాలి రాదు.

అయితే స్వామి వారికి ఇరువైపులా వున్న దీపారాధన నిరంతరం గాలికి రెపరెపలాడుతూ వుంటుంది. ఈ రెండు దీపాలు స్వామివారి నాశికా భాగానికి సమాన దూరంలో వుంటాయి. దాంతో స్వామి వారి శ్వాస కారణంగానే అలా జరుగుతుందనే విషయం స్పష్టమైంది. అందువలన ఇక్కడి శివలింగం వాయులింగంగా ప్రసిద్ధికెక్కింది. ఈ కారణంగానే ఇక్కడి స్వామివారిని దర్శిస్తే పరమశివుడిని ప్రత్యక్షంగా దర్శించిన ఫలితం దక్కుతుందని భక్తులు విశ్వసిస్తుంటారు.
X

Feedback Form

Your IP address: 54.197.90.95