ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కుజదోష ప్రభావాన్ని తగ్గించే రుద్రాక్ష !

Fri, Feb 20, 2015, 11:14 PM
జీవితం ఆనందంగా ... హాయిగా సాగిపోవాలనే అందరూ అనుకుంటూ వుంటారు. ఆశించిన ప్రయోజనాలను పొందుతూ, ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా కాలం గడిచేలా చూడమని భగవంతుడిని ప్రార్ధిస్తూ వుంటారు. తెలిసీ తెలియక చేసిన పాపాలు ఏవైనా వుంటే పెద్దమనసుతో మన్నించమని దైవాన్ని కోరుతుంటారు. ఇకమీదట ఎవరికీ ఎలాంటి కష్టం కలిగించకుండా నడచుకుంటానని చెప్పుకుంటూ వుంటారు.

అయినా ఏ వైపు నుంచి ఎలాంటి ప్రమాదం ముంచుకు వస్తుందోననే ఆందోళన వెంటాడుతూ వుంటుంది. ఫలితంగా మానసిక ప్రశాంతత దూరమైపోతుంటుంది. ఇలాంటి పరిస్థితుల బారినుంచి బయటపడేసేదిగా 'త్రిముఖి' రుద్రాక్ష కనిపిస్తుంది. అత్యంత శక్తిమంతమైన ఈ రుద్రాక్ష, అగ్నిస్వరూపంగా చెప్పబడుతోంది. జీవితంలోని ఆనందాన్ని హరించివేసే దురదృష్టాన్ని ఈ రుద్రాక్ష దూరంగా ఉంచుతుంది.

దీని ధారణ వలన అనవసరమైన విషయాలను గురించి ఆలోచిస్తూ ఆందోళన చెందడం తగ్గిపోతుంది. మానసికపరమైన వత్తిడిని దూరం చేస్తూ ఆరోగ్యాన్ని రక్షిస్తూ వస్తుంది. ఇక ఈ రుద్రాక్ష పాలకుడు 'కుజుడు' కాబట్టి, ఈ గ్రహసంబంధమైన దోషంతో ఇబ్బందులు పడుతోన్నవాళ్లు దీనిని ధరించడం వలన మంచిఫలితం కనిపిస్తుంది. కుజదోషం నుంచి ... అనారోగ్యాల నుంచి బయటపడాలనుకునేవాళ్లు, విద్యా సంబంధమైన విషయాల్లో రాణించాలనుకునే వాళ్లు ఈ రుద్రాక్షను ధరించడం వలన ఆశించిన ప్రయోజనం చేకూరుతుందని చెప్పబడుతోంది.
X

Feedback Form

Your IP address: 54.204.130.177