ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

గండాలను తొలగించే వేంకటేశ్వరుడు

Fri, Jan 30, 2015, 10:00 AM
Related Image జీవితమన్నాక ఆనందాలు ... విషాదాలు పలకరిస్తూనే వుంటాయి. ఏ సమస్యా లేనంత వరకూ అంతా సాఫీగా గడచిపోతూ వుంటుంది. ఇక అనుకోకుండా ఏ ఆపద కలిగినా దానిని మానసికంగా ఎదుర్కోవడం అంతతేలికైన విషయం కాదు. అలా అనుకోని గండాలు ఎదురైనప్పుడు అందరికీ గుర్తుకువచ్చే దేవుడు ఆ వేంకటేశ్వరుడే. ఆయన అందరికీ దగ్గరవాడు .. అపారమైన భక్తివిశ్వాసాలను అందుకున్నవాడు. అందుకే ఆపద మొక్కులవాడిగా భక్తులు ఆయనని కొనియాడుతుంటారు.

అలా భక్తులచే నిత్యనీరాజనాలు అందుకునే వేంకటేశ్వరుడు 'రేపాల' లో దర్శనమిస్తున్నాడు. నల్గొండ జిల్లా మునగాల మండలం పరిధిలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. సువిశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఆలయం వేంకటేశ్వరస్వామి వైభవాన్ని ప్రతిబింబిస్తూ వుంటుంది. ప్రాచీనకాలం నుంచి స్వామివారు ఇక్కడ కొలువుదీరి ఉన్నట్టుగా స్థలపురాణం చెబుతోంది. స్వామివారి మహిమలు ఇక్కడ కథలు కథలుగా వినిపిస్తూ వుంటాయి.

శ్రీదేవి - భూదేవి సమేతంగా స్వామివారు ఈ క్షేత్రంలో పూజాభిషేకాలు అందుకుంటూ వుంటాడు. ప్రతి శనివారంతో పాటు పర్వదినాల్లో స్వామివారిని దర్శించే భక్తుల సంఖ్య ఎక్కువగా వుంటుంది. ఎలాంటి ఆపదలో చిక్కుకున్నా మనసులో ఇక్కడి స్వామివారికి మొక్కుకుంటేచాలు, ఆ గండం నుంచి బయటపడటం జరుగుతుందని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు.

ఎవరిని ఏ విషయంగా దుఃఖం వెంటాడుతూ వున్నా, స్వామి దర్శనభాగ్యంతో అది దూరమైపోతుందని అంటారు. తమను కాపాడుతూ వస్తోన్న స్వామివారిని మరింత వైభవంగా చూసుకోవడానికి భక్తులు ఉత్సాహాన్ని చూపుతుంటారు. అంగరంగవైభవంగా ఆయనకి ఉత్సవాలు జరిపిస్తూ తరిస్తుంటారు.
X

Feedback Form

Your IP address: 54.204.247.205