ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అడిగిన వరాలనిచ్చే అమ్మవారు

Fri, Jan 23, 2015, 08:56 AM
Related Image ఆదిపరాశక్తి అయిన అమ్మవారు దుష్టశిక్షణ .. శిష్టరక్షణ కోసం వివిధ రూపాలను ధరించింది. దేవతలు ... మహర్షుల అభ్యర్థనమేరకు ఆ తల్లి అనేక ప్రాంతాలలో ఆవిర్భవించింది. అలా కొలువైన అమ్మవారిని భక్తులు తమ ఇలవేల్పుగా భావించి పూజిస్తూ వస్తున్నారు. అలా భక్తులచే నిత్యనీరాజనాలు అందుకుంటోన్న అమ్మవారి క్షేత్రాల్లో ఒకటి 'ఏలూరు'లో దర్శనమిస్తుంది.

ఏలూరులో 'జలాపరేశ్వరస్వామి' క్షేత్రం గురించి తెలియనివాళ్లు వుండరు. ప్రాచీనకాలంనాటి ఈ క్షేత్రం అలనాటి వైభవంతో పాటు, మహిమలను కూడా ఆవిష్కరిస్తూ ప్రసిద్ధిచెందింది. ఈ ప్రాంగణంలోనే అమ్మవారు 'మహిషాసుర మర్ధిని' గా భక్తులకు దర్శనమిస్తూ వుంటుంది. లోక కల్యాణకారకమైన అమ్మవారి రూపం శత్రుభయాన్ని నశింపజేస్తూ దర్శనమిస్తుంది. ఈ క్షేత్రానికిగల మహాత్మ్యం కారణంగా అమ్మవారు ఇక్కడ ప్రత్యక్షంగా కొలువైవుందని భక్తులు విశ్వసిస్తుంటారు.

ప్రతి శుక్రవారం అమ్మవారిని దర్శించే మహిళా భక్తుల సంఖ్య ఎక్కువగా వుంటుంది. ఈ రోజున అమ్మవారికి ప్రత్యేక అలంకారాలు ... పూజలు జరుగుతుంటాయి. ఈ పూజలో పాల్గొనడం వలన వివాహయోగం ... సంతాన సౌభాగ్యాలు కలుగుతాయని చెబుతుంటారు. అమ్మవారికి మొక్కుకుని ఆ తల్లికి ప్రదక్షిణలుచేస్తే అనారోగ్యాలు ... ఆర్ధికపరమైన సమస్యలు తొలగిపోతాయని అంటారు. ఆ తల్లి ఆశీస్సులు అందుకుని ఆరంభించిన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తవుతాయని విశ్వసిస్తుంటారు.

ఇక ఈ క్షేత్రంలో దేవీనవరాత్రులు అంగరంగవైభవంగా జరుగుతూ వుంటాయి. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని, ఆ తల్లికి కానుకలు ... మొక్కుబడులు సమర్పించుకుంటూ వుంటారు. జలాపరేశ్వరస్వామినీ ... అమ్మవారిని దర్శించుకున్నంత మాత్రాన్నే సమస్త పాపాలు నశించి సకలశుభాలు చేకూరతాయని ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.
X

Feedback Form

Your IP address: 54.146.177.118