ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వేడుకోగానే వేదనలుతీర్చే వినాయకుడు

Sat, Jan 17, 2015, 11:37 AM
Related Image ఉదయాన్నే వినాయకుడిని దర్శించినా ... స్మరించినా ... పూజించినా ఆ రోజున పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయని చెప్పబడుతోంది. అందువల్లనే ఆయన అనుమతిని కోరుతూ ... అనుగ్రహాన్ని ఆశిస్తూ శుభకార్యాలు ఆరంభిస్తూ వుంటారు.

వినాయకుడి చిత్రపటంగానీ ... ప్రతిమకాని లేని ఇల్లంటూ వుండదు. అంతగా అందరూ వినాయకుడిని విశ్వసిస్తుంటారు. ఈ కారణంగానే వినాయకుడి ఆలయాలకి భక్తుల తాకిడి ఎప్పుడూ కనిపిస్తూ వుంటుంది. అలా భక్తులచే నిత్యనీరాజనాలు అందుకునే వినాయక క్షేత్రం'ఇరుసుమండ' లో అలరారుతోంది. తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండల పరిధిలో ఈ క్షేత్రం వెలుగొందుతోంది.

ఇక్కడి వినాయకుడుని భక్తులు ఎంతగానో ఆరాధిస్తూ వుంటారు. ఆయనకి నమస్కరించుకునే తమ ప్రయాణాలను ప్రారంభిస్తుంటారు. ఆయన ఆశీస్సులు అందుకునే కొత్తపనులకు శ్రీకారం చుడుతుంటారు. స్వామి అనుగ్రహం కారణంగా తలపెట్టిన ఏ కార్యమైనా ఎలాంటి అవాంతరాలు లేకుండా పూర్తవుతుందని చెబుతుంటారు. ఎలాంటి కష్టం కలిగినా స్వామికి చెప్పుకుంటేచాలు, ఆ కష్టం వెంటనే తీరిపోతుందని అంటారు.

పర్వాదినాల్లోనేకాదు ... పరీక్షా సమయాల్లోనూ విద్యార్థులు స్వామివారిని దర్శించుకుంటూ వుంటారు. ఆయన అనుగ్రహాన్ని కోరుకుంటూ వుంటారు. ఇలా ఇక్కడి వినాయకుడిని పూజించడం వలన కార్యసిద్ధి కలుగుతుందనీ, కష్టాలు తొలగిపోతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.
X

Feedback Form

Your IP address: 184.73.122.162