ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సూర్యభగవానుడికి ఆవుపాలతో అభిషేకం

Tue, Jan 13, 2015, 08:50 PM
Related Image సంక్రాంతి రోజున సూర్యభగవానుడు మకరరాశి రాశిలోకి ప్రవేశిస్తాడు కనుక దీనిని మకరసంక్రాంతి అంటారు. ఈ రోజు నుంచే ఉత్తరాయణం ఆరంభమవుతుంది. దక్షిణాయణం దేవతలకు రాత్రికాగా ... ఉత్తరాయణం పగలు. అందువలన ఉత్తరాయణం పుణ్యకాలంగా చెప్పబడుతోంది. ఈ కాలంలో చేసే శుభకార్యాలకు దేవతల ఆశీస్సులు లభిస్తాయనీ, ఫలితంగా ఆయాకార్యాలు ఆశించిన ప్రయోజనాలను ఇస్తాయని అంటారు.

అందువల్లనే ఈ కాలంలో వివాహాలు .. ఉపనయనాలు ... గృహప్రవేశాలు ... అక్షరాభ్యాసాలు ... వ్రతాలు విరివిగా జరుగుతూ వుంటాయి. ఇలా సంక్రాంతి రోజున ఉత్తరాయణ యాత్రను ఆరంభించే సూర్యభగవానుడు అనేక శుభాలను అందిస్తూ ముందుకు సాగుతుంటాడు కనుక, ఈ రోజున అంతా ఆయనని ఆరాధిస్తూ వుండాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

సంవత్సరమని చెప్పుకునే ఒకే చక్రం కలిగిన విశ్వమనే రథంపై సూర్యభగవానుడు ప్రయాణిస్తూ వుంటాడు. ఆయన కృపా కటాక్షాలతోనే అందరికీ ఆహారం సమకూరుతుంది ... ఆరోగ్యం చేకూరుతుంది. ఆ ప్రత్యక్షనారాయణుడి అనుగ్రహంతోనే సమస్త పాపాలు నశించి పుణ్యఫలాలు లభిస్తాయి. అలాంటి సూర్యభగవానుడిని కృతజ్ఞతా పూర్వకంగా అనుదినం పూజించాలి.

ముఖ్యంగా సంక్రాంతి రోజున తలస్నానం చేసి, స్వామిని ఆవుపాలతో అభిషేకించి ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి. ఈ రోజున సూర్యభగవానుడిని ఆవుపాలతో అభిషేకించడం వలన ... ఆదిత్య హృదయం పారాయణ చేయడం వలన ఆరోగ్యం ... ఐశ్వర్యం ... విజయం చేకూరతాయని స్పష్టం చేయబడుతోంది.
X

Feedback Form

Your IP address: 54.147.238.62