ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

లక్ష్మీదేవి నామస్మరణ చేస్తే చాలు

Sat, Jan 10, 2015, 11:35 AM
Related Image ధనధాన్యాలతో ఏ ఇల్లైనా కళకళలాడుతూ ఉండాలంటే అందుకు లక్ష్మీదేవి అనుగ్రహం వుండాలి. ఏ ఇంటనైనా సిరిసంపదలు నాట్యం చేయాలంటే ఆ ఇంటివైపు లక్ష్మీదేవి కన్నెత్తి చూడాలి. అమ్మవారు కరుణించి కాలుపెడితే అంతా ఐశ్వర్యమే ... ఆనందమే. లక్ష్మీదేవి కరుణామృతాన్ని అందుకోవాలంటే భక్తిశ్రద్ధలు ఎంతో అవసరం.

అనునిత్యం అంకితభావంతో లక్ష్మీదేవిని సేవించడం వలన ఆమె కరుణాకటాక్ష వీక్షణాలు తప్పక లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. శుక్రవారం రోజున లక్ష్మీదేవిని అభిషేకించి గులాబీలతో పూజించడం వలన ఆమె ప్రీతి చెందుతుంది. అంతే కాకుండా లక్ష్మీదేవి నామాన్ని నిరంతరం స్మరిస్తూ వుండటం వలన కూడా ఆ తల్లి అనుగ్రహం లభిస్తుంది.

అనునిత్యం లక్ష్మీదేవి నామాన్ని స్మరిస్తూ వుండటం వలన, అలాంటివాళ్లను విడచివెళ్లకుండా ఆమె స్థిరనివాసం చేస్తుంది. సాధారణంగా లక్ష్మీదేవి చంచలమైన మనసును కలిగి ఉంటుందనీ, అందువలన ఒకచోట కుదురుగా ఉండకుండా వెళ్లిపోతూ ఉంటుందని అనుకుంటూ వుంటారు. నిజానికి లక్ష్మీదేవి స్వభావం అది కానేకాదు.

ధర్మబద్ధమైన ... పవిత్రమైన జీవన విధానాన్ని చూసి, సంప్రదాయబద్ధమైన పద్ధతులను చూసి లక్ష్మీదేవి రావడం జరుగుతుంది. ఏవైతే మంచి లక్షణాలను చూసి అమ్మవారు అక్కడ ఉందామని అడుగుపెడుతుందో, ఆ తరువాత ఆ ఇంట్లోని వ్యక్తులు అమ్మవారికి ఇబ్బంది కలిగించేలా ఆ లక్షణాలను మార్చుకున్నప్పుడు సహజంగానే ఆమె ఆ ప్రదేశాన్ని విడిచి వెళ్లిపోతుంది.

లక్ష్మీదేవి రావడం ... తిరిగి వెళ్లిపోవడనేది పూర్తిగా ఆ ఇంట్లోవాళ్లు నడచుకునే విధానంపై మాత్రమే ఆధారపడి వుంటుంది. లక్ష్మీదేవి స్థిరనివాసం చేయాలంటే పవిత్రమైన జీవనవిధానానికి భంగం కలగకుండా చూసుకోవాలి. లక్ష్మీదేవిని అనునిత్యం పూజిస్తూ .. సేవిస్తూ ... ఆ తల్లి నామాన్ని వదలక స్మరిస్తూ ఉండటం వలన సంపదలకు ఎలాంటి లోటు ఉండదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
X

Feedback Form

Your IP address: 54.167.149.128