ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సోమారామం

Fri, May 31, 2013, 12:21 PM
Related Image భక్త జనకోటి హృదయాలపై ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లే పంచారామ క్షేత్రాలలో 'సోమారామం' ఒకటి. తూర్పు గోదావరి జిల్లా ... భీమవరం సమీపంలోని 'గుణిపూడి' గ్రామంలో ఈ క్షేత్రం వెలసింది. భక్త సులభుడైన శివయ్య ఇక్కడ 'సోమేశ్వరస్వామి' పేరుతో నిత్య పూజలందుకుంటూ ఉంటాడు. ఇక్కడి శివలింగం పౌర్ణమి రోజుకి తెలుపు రంగులోకి ... అమావాస్య నాటికి నలుపు రంగులోకి మారుతూ వుంటుంది. చంద్రుడు ప్రతిష్టించిన కారణంగానే, ఆయనని అనుసరిస్తూ ఈ శివలింగం రంగుమారుతూ ఉంటుందని చెబుతుంటారు.

ఈ విశేషాన్ని తిలకించడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా ఇక్కడి తరలి వస్తుంటారు. ఇక ఈ శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్టించడం వెనుక కూడా ఓ పురాణ కథ వుంది. చంద్రుడు తన గురువైన బృహస్పతి భార్య 'తార'ను మోహించాడు. గురువు భార్యను మోహించిన పాపానికి ప్రాయశ్చిత్తముగా ఆయన ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని అంటారు. ఇక్కడి అమ్మవారు 'అన్నపూర్ణ'గా భక్తులను అనుగ్రహిస్తూ వుంటుంది. ఈ క్షేత్రంలోని 'చంద్ర పుష్కరిణి' లో స్నానం చేస్తే పాపాలు పటాపంచలవుతాయని విశ్వసిస్తూ వుంటారు. చాళుక్య భీముడు ఈ దేవాలయానికి ప్రాకారాలను ...గోపురాన్నినిర్మించాడనడానికి చారిత్రక ఆధారాలు కనిపిస్తున్నాయి.

ప్రతి ఏడాది ఇక్కడ 'మహా శివరాత్రి' సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవాలు అయిదు రోజులపాటు జరుగుతాయి. అలాగే 'దేవీనవరాత్రులు' కూడా ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతూ వుంటుంది. ఈ పర్వదినాల్లో ఆదిదంపతులను దర్శించడంవలన సకల పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
X

Feedback Form

Your IP address: 54.87.119.171