ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వివాహయోగాన్ని కలిగించే గోదాదేవి !

Thu, Jan 08, 2015, 03:06 PM
Related Image భక్తుల విశ్వాసాన్ని అనుసరించి ఒక్కో పుణ్యక్షేత్రం ఒక్కో విశేషాన్ని కలిగి వుంటుంది. ఆయురారోగ్యాలను ప్రసాదించేవి కొన్నయితే, సంతాన సౌభాగ్యాలను అందించేవిగా మరికొన్ని కనిపిస్తుంటాయి. ఇక వివాహం విషయంలో ఎదురవుతోన్న ఆటంకాల నుంచి బయటపడేసేవిగా కూడా కొన్ని క్షేత్రాలు అలరారుతున్నాయి.

అలా వివాహయోగాన్ని కలిగించే 'శ్రీ గోదా పద్మావతీ సమేత వేంకటేశ్వర క్షేత్రం' రావులపాలెంలో దర్శనమిస్తుంది. రావులపాలెం - పార్కు సెంటరులో గల ఈ ఆలయం సువిశాలమైన ప్రదేశంలో నిర్మించబడింది. భారీ నిర్మాణంగా కనిపించే ఈ ఆలయం ... భక్తిభావపరిమళాలను వెదజల్లుతూ ఆధ్యాత్మిక వైభవాన్ని చాటుతుంటుంది.

ధనుర్మాసంలో ఇక్కడ ప్రత్యేక పూజలు ... ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఇక 'భోగి' రోజున గోదాదేవికి స్వామివారితో జరిగే కల్యాణ మహోత్సవాన్ని చూసితీరవలసిందే. అంగరంగవైభవంగా జరిగే ఈ వేడుకకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తుంటారు. తన మధురభక్తితో రంగనాయకస్వామివారి మనసుని గోదాదేవి గెలుచుకుని ఆయనని పరిణయమాడినది ఈ రోజునేనని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

అలాంటి ఈ రోజున స్వామివారితో అమ్మవారికి జరిగే కళ్యాణమహోత్సవాన్ని కన్నెపిల్లలు దర్శించినట్టయితే మనసుకి నచ్చినవారితో వారి వివాహం జరుగుతుందని చెబుతుంటారు. వివాహం విషయంలో అనుకోని ఆటంకాలు ఎదురవుతోన్న కారణంగా ఇబ్బందులు పడుతోన్నవాళ్లు ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన ... కల్యాణోత్సవాన్ని తిలకించడం వలన ఆ దోషం తొలగిపోతుందని అంటారు. అమ్మవారు స్వామివారితో కలిసి ఇక్కడ ప్రత్యక్షంగా కొలువై వుందని విశ్వసిస్తుంటారు. మహిమాన్వితమైన ఈ క్షేత్రంలో అడుగుపెట్టడం వలన మనోభీష్టం తప్పక సిద్ధిస్తుందని చెబుతుంటారు.
X

Feedback Form

Your IP address: 54.163.166.22