ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సంక్రాంతి రోజున స్నాన విశేషం

Thu, Jan 08, 2015, 09:39 AM
Related Image విశేషమైన రోజుల్లో తలస్నానం చేసి భగవంతుడిని ఆరాధించడం జరుగుతూ వుంటుంది. ఇక కొన్ని పర్వదినాల్లో తలస్నానమే ప్రాధాన్యతను సంతరించుకుని కనిపిస్తూ వుంటుంది. ఈ రోజుల్లో చేసే తలస్నానం విశేషమైన ఫలితాలను ఇస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.అలా స్నాన విశేషాన్ని కలిగిన పర్వదినాల్లో 'సంక్రాంతి' ఒకటిగా కనిపిస్తూ వుంటుంది.

సూర్యభగవానుడు మకరరాశిలోకి ప్రవేశించిన ఈ పుణ్యకాలంలో తలస్నానం తప్పనిసరిగా చేయాలని చెప్పబడుతోంది. ఈ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి దైవారాధన చేయాలి. శ్రీమహావిష్ణువును ... పౌష్యలక్ష్మిగా అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధించవలసి వుంటుంది. పితృదేవతలను కూడా పూజించవలసి వుంటుంది. ఈ రోజున ఎవరికి ఎలాంటి దానం చేసినా అది అనేక రెట్లు అధికమై ఆ పుణ్యఫలాలు ముందుజన్మలకి సిద్ధంగా ఉంటాయని అంటారు.

స్నాన విశేషాన్ని కలిగిన ఈ రోజున తలస్నానం చేయకపోతే, వివిధరకాల వ్యాధుల బారినపడటం జరుగుతుందనీ, దారిద్ర్యాన్ని అనుభవించవలసి వస్తుంది. అందువలన సంక్రాంతి పండుగ రోజున తలస్నానం ఒక నియమంగా చెప్పబడుతోంది ... ఈ నియామాన్ని ఆచరించడం వలన సకలశుభాలు చేకూరతాయని స్పష్టం చేయడం జరుగుతోంది.
X

Feedback Form

Your IP address: 54.197.66.254