ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ముక్కోటి ఏకాదశి రోజున నైవేద్యం

Wed, Dec 24, 2014, 09:51 PM
Related Image వైష్ణవ సంబంధమైన ఆలయాలన్నీ ముక్కోటి ఏకాదశి రోజున తెల్లవారుజామునే భక్తజన సందోహంతో కిటకిటలాడుతూ వుంటాయి. ఈ రోజున శ్రీమహావిష్ణువును ఉత్తరద్వారం గుండా దర్శించుకోవడానికిగాను భక్తులు ఆలయాలకి పెద్దయెత్తున తరలివస్తుంటారు.

ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగనిద్రలోకి వెళ్లిన శ్రీమహావిష్ణువు, కార్తీకశుద్ధ ఏకాదశి రోజున యోగనిద్ర నుంచి మేల్కొని, శ్రీదేవి - భూదేవి సమేతంగా ఈ ఏకాదశి రోజున వైకుంఠానికి తిరిగివచ్చాడట. అప్పుడు ముక్కోటి దేవతలు ఉత్తరద్వారం చెంత నిలిచి స్వామి దర్శనం చేసుకున్నారని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

ఈ కారణంగానే దీనిని ముక్కోటి ఏకాదశిగా పిలుస్తుంటారు. ఈ రోజున స్వామివారిని ఉత్తరద్వారం గుండా దర్శించుకోవడం వలన మోక్షానికి అవసరమమైన అర్హత లభిస్తుందని చెప్పబడుతోంది. విశేషమైన రోజుల్లో స్వామివారికి జరిపే పూజాభిషేకాల విషయం అటుంచితే, ఆ రోజుల్లో సమర్పించే నైవేద్యం కూడా విశేషాన్ని సంతరించుకుని కనిపిస్తుంది.

ఈ నేపథ్యంలో ముక్కోటి రోజున స్వామివారికి ఏ నైవేద్యం సమర్పిస్తే మంచిదనే విషయంలో కొంతంమంది ఆలోచనలో పడుతుంటారు. ఈ రోజున స్వామివారికి ప్రీతికరమైన 'పాయసం'తో పాటు వివిధరకాల తీపిపదార్థాలను ఆయనకి నైవేద్యంగా సమర్పించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.159.129.152