ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మంగళవారం హనుమ ఆరాధనా ఫలితం !

Tue, Dec 09, 2014, 09:46 AM
Related Image మంగళవారం రోజున హనుమంతుడి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. ఈ రోజున చాలామంది భక్తులు హనుమంతుడికి ప్రదక్షిణలు చేస్తుంటారు. స్వామికి సిందూర అభిషేకాలు ... ఆకుపూజలు చేయిస్తుంటారు. ఆయనకి ఇష్టమైన వడలు ... అప్పాలను నైవేద్యంగా చేయించి సమర్పిస్తుంటారు.

ఈ విధంగా చేయడం వలన స్వామి ప్రీతిచెంది కోరిన వరాలను ప్రసాదిస్తాడని భక్తులు విశ్వసిస్తుంటారు. సాధారణంగా శారీరక మానసిక రుగ్మతలతో బాధపడుతోన్నవాళ్లు ... దుస్వప్నాలతో ఇబ్బందులు పడుతోన్నవాళ్లు హనుమంతుడి పాదాలను ఆశ్రయిస్తుంటారు. తమను అవస్థల నుంచి బయటపడేయమని కోరుతుంటారు.

ఇక గ్రహసంబంధమైన దోషాలతో నానాఇబ్బందులు పడుతున్నవాళ్లు కూడా ఆ స్వామి అనుగ్రహాన్ని ఆశిస్తుంటారు. ఈ నేపథ్యంలో శని సంబంధమైన ... కుజ సంబంధమైన దోషాలతో బాధపడుతోన్నవాళ్లు హనుమంతుడిని ఆరాధించడం వలన ఆశించిన ప్రయోజనం కనిపిస్తుందని చెప్పబడుతోంది.

ప్రతి మంగళవారం హనుమంతుడికి భక్తిశ్రద్ధలతో ప్రదక్షిణలు చేయడం వలన ... పూజాభిషేకాలు జరిపించడం వలన ... 'సుందరకాండ' పారాయణ చేయడం వలన ... 'హనుమాన్ చాలీసా' చదవడం వలన హనుమంతుడు ప్రీతి చెందుతాడు. ఆయన ప్రభావం వలన ఇటు కుజుడు ... అటు శనిదేవుడు శాంతించి అనుగ్రహిస్తారని చెప్పబడుతోంది. కాబట్టి కుజదోషంతోను ... శని దోషంతోను అవస్థలు పడుతోన్నవాళ్లు మంగళవారం హనుమంతుడిని ఆరాధించడం వలన ఆశించిన ప్రయోజనం కనిపిస్తుందనే విషయాన్ని మరిచిపోకూడదు.
X

Feedback Form

Your IP address: 54.167.142.229