ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సుబ్రహ్మణ్యుడి సన్నిధిలో నిద్రచేస్తే చాలు

Fri, Nov 28, 2014, 10:50 AM
Related Image సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు తమిళనాడు ... కేరళ ... కర్ణాటక ... ఆంధ్ర ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ప్రతి ప్రాంతంలోనూ స్వామి స్వయంభువుగా ఆవిర్భవించిన ప్రదేశాలు దివ్యక్షేత్రాలుగా విలసిల్లుతున్నాయి. కొన్నిక్షేత్రాల్లో స్వామికి ప్రదక్షిణలు చేయడం వలన, మరికొన్ని క్షేత్రాల్లో అభిషేకాలు జరిపించడం వలన స్వామి అనుగ్రహిస్తూ ఉంటాడని చెబుతుంటారు.

ఒక క్షేత్రంలో మాత్రం స్వామి సన్నిధిలో ఒక రాత్రి నిద్రచేయడం వలన ఆ స్వామి కరుణా కటాక్షాలు లభిస్తాయని అంటారు. ఆ క్షేత్రమే 'కుక్కె సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రం' ... ఇది కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లా పరిధిలో దర్శనమిస్తుంది. ఇక్కడి స్వామి నెమలి వాహనాన్ని అధిష్టించి ఉండగా, ఆయన సన్నిధిలో ఆదిశేషుడు - వాసుకి దర్శనమిస్తూ ఉంటారు.

ప్రశాంతమైన వాతావరణంలో నదీ తీరంలో అలరారుతోన్న ఈ క్షేత్రానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. వివాహం విషయంలో సమస్యలు ... అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నవాళ్లు, సంతాన సౌభాగ్యాలను కోరుకునేవారు ఈ స్వామిని దర్శిస్తూ ఉంటారు. స్వామి దర్శనం చేసుకుని ఆయనకి పూజాభిషేకాలు జరిపించి ఆ రాత్రికి అక్కడ నిద్రచేస్తుంటారు. మరునాడు మరలా ఆయన దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమవుతుంటారు. ఈ విధంగా సుబ్రహ్మణ్యస్వామి సన్నిధిలో నిద్ర చేయడం వలన నాగదోషాలు ... గ్రహ సంబంధమైన దోషాలు నశించిపోతాయని విశ్వసిస్తుంటారు.
X

Feedback Form

Your IP address: 54.205.8.87