ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అండదండగా నిలిచే ఆంజనేయుడు

Tue, Nov 25, 2014, 11:05 AM
Related Image సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే రామావతారాన్ని ధరించాడు. సీతను రావణుడు అపహరించినప్పుడు, ఆమెను వెతుకుతూ రామలక్ష్మణులు బయలుదేరుతారు. ఆ సమయంలోనే వాళ్లకి హనుమంతుడు పరిచయమవుతాడు. రాముడి ఆవేదనను అర్థం చేసుకున్న హనుమంతుడు, ఆయన సన్నిధికి సీతమ్మవారు చేరేంతవరకూ విశ్రమించలేదు.

అలాగే సాధారణ మానవులు కష్టాల్లో ... సమస్యల్లో ఉన్నప్పుడు వాళ్లను ఆదుకోవడంలోను హనుమంతుడు ముందేవుంటాడు. ఈ కారణంగానే హనుమంతుడి ఆలయాలు గ్రామగ్రామాన దర్శనమిస్తూ ఉంటాయి. అలాంటి గ్రామాల్లో ఒకటిగా 'పరెడ్డిగూడెం' కనిపిస్తుంది. నల్గొండ జిల్లా గరిడేపల్లి మండలంలో ఈ ఆలయం అలరారుతోంది.

మహిమాన్వితమైనదిగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రానికి ప్రతి మంగళవారం విశేషమైన సంఖ్యలో భక్తులు వస్తుంటారు. స్వామివారికి సిందూర అభిషేకాలు ... ఆకుపూజలు చేయిస్తుంటారు. ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్లంతా ఇక్కడి హనుమంతుడిని తమ ఇలవేల్పుగా భావించి పూజిస్తూ ఉంటారు. స్వామి అనుగ్రహం కారణంగానే ఇక్కడి పాడిపంటలు వృద్ధి చెందుతున్నాయని విశ్వసిస్తుంటారు.

హనుమంతుడిని అంకితభావంతో పూజించడం వలన, ఆయన అండదండగా నిలిచి కాపాడుతూ ఉంటాడని అంటారు. ఈ స్వామి అనుగ్రహంతో ఎంతోమంది అనారోగ్య సమస్యల నుంచి ... ఆర్ధికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడ్డారని చెబుతుంటారు. స్వామివారు స్వప్నదర్శనం ఇచ్చిన అనుభవం ఇక్కడ ఎంతోమంది భక్తులకు ఉంది. హనుమజ్జయంతి రోజున ... పర్వదినాల్లోను ప్రత్యేక పూజలు ... ఉత్సవాలు ఇక్కడ జరుపుతుంటారు. ఈ సందర్భంగా హనుమంతుడి ఆశీస్సులు అందుకుంటూ ఉంటారు. ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుని మొక్కుబడులు చెల్లిస్తూ ఉంటారు.
X

Feedback Form

Your IP address: 54.205.87.3