ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కంకణ ధారణ

Fri, Jun 21, 2013, 06:09 PM
దైవ సంబంధితమైన కార్యక్రమాలలోనూ ... శుభ కార్యాలలోను 'కంకణ ధారణ'అనేది ఒక నియమంగా వస్తోంది. సాధారణంగా మావిడాకును గానీ, తమలపాకును గాని పసుపు రాసిన దారానికి చుట్టి ... ఆ కంకణాన్ని చేతికి కడుతూ వుంటారు. అయితే ఈ కంకణం ఎందుకు కడతారు? ... దాని వలన ప్రయోజనమేమిటి? అనే సందేహాలు కలుగుతుండటం సహజం.

దైవ కార్యమో ... శుభకార్యమో నిర్వహించేటప్పుడు కంకణ బద్ధులై వుండాలని శాస్త్రం చెబుతోంది. ఆ సమయంలో ఎలాంటి అపచారాలు జరగకుండా తాము నిష్టగా ... పవిత్రంగా ఉండవలసిన విషయాన్ని ఈ కంకణం గుర్తుచేస్తుంటుంది. అంతే కాకుండా చేతి మణికట్టుకు ఈ కంకణ ధారణ జరగడం వలన అక్కడుండే నాడికి ఒత్తిడి కలిగి రక్త ప్రసరణ సరిగ్గా జరిగేలా చేస్తుంది. ఇలా ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ... ఆరోగ్యపరంగా కూడా కంకణ ధారణ ప్రయోజనకారిగా ఉంటుందనే ఉద్దేశంతోనే పూర్వీకులు ఈ నియమాన్ని ఏర్పాటు చేశారని అంటారు.
X

Feedback Form

Your IP address: 50.16.52.237