ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ప్రదక్షిణలు చేయడం వలన కలిగే ఫలితం !

Thu, Nov 20, 2014, 10:25 AM
Related Image దేవాలయానికి ఎప్పుడు వెళ్లినా కాస్తంత తీరిక చేసుకుని వెళ్లాలని పెద్దలు చెబుతుంటారు. ఎందుకంటే మనసులో భగవంతుడిని నిలుపుకోవడానికీ ... ఆయన నామాన్ని స్మరిస్తూ ప్రదక్షిణలు చేయడానికీ ... కనులారా దైవాన్ని దర్శించడానికీ ... తీర్థప్రసాదాలు స్వీకరించిన తరువాత కాసేపు అక్కడ కూర్చుని భగవంతుడిని తలచుకోవడానికి కొంత సమయం అవసరమవుతుంది.

అలా కాకుండా హడావిడిగా ఆలయ దర్శనం చేయడం వలన, ఏ మనశ్శాంతినైతే ఆశిస్తామో అదే లభించకుండాపోతుంది. గుడికి వెళ్లివస్తే ఒక పనైపోతుందని అనుకుంటే, ఆ దర్శనం వలన ఎలాంటి ఫలితం లభించదని అర్థంచేసుకోవాలి. అంకితభావంతో భగవంతుడి పాదాలపై మనసునీ ... దృష్టిని నిలిపి ఆయనని సమీపించే ప్రయత్నం చేసినప్పుడే దర్శనం వలన సంతోషం ... సంతృప్తి కలుగుతాయి.

కొంతమంది పనుల వత్తిడి కారణంగా వెంటనే తిరిగి వెళ్లి పోవాలనే ఉద్దేశంతో, ప్రదక్షిణలు చేయకుండానే నేరుగా ముఖమంటపంలోకి వెళ్లి దైవదర్శనం చేసుకుంటూ ఉంటారు. ప్రదక్షిణ వలన జన్మజన్మల పాపాలు నశిస్తాయనీ, విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయని చెప్పబడుతోంది. ప్రదక్షిణలు చేయనివాళ్లు పాపాలను ప్రక్షాళన చేసుకునే అవకాశాన్నీ, పుణ్యఫలాలను అందుకునే అదృష్టాన్ని కోల్పోయినట్టు అవుతుంది.

అందువలన ఆలయానికి వెళ్లగానే కాళ్లు కడుక్కుని ... నీరు పుక్కిలించి ... తలపై కాసిన్ని నీళ్లు చల్లుకుని ముందుగా ప్రదక్షిణలు చేయాలి. అడుగుల శబ్దం రాకుండా నిదానంగా ప్రదక్షిణలు పూర్తిచేసిన తరువాతనే దైవదర్శనం చేసుకోవాలి. భగవంతుడి సన్నిధిలో నిలబడే అర్హతను ప్రసాదించేవి ప్రదక్షిణలేననే విషయాన్ని మరిచిపోకూడదు.
X

Feedback Form

Your IP address: 54.204.130.177