ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కొండపై పొంగిన గంగమ్మతల్లి

Fri, Nov 07, 2014, 01:12 PM
Related Image వనవాస కాలంలో సీతారాములు ఎన్నో ప్రాంతాలమీదుగా ప్రయాణం కొనసాగిస్తూ వెళ్లారు. ఈ సమయంలోనే రాముడు అనేక ప్రదేశాల్లో శివలింగాలను ప్రతిష్ఠిస్తూ ... సీతమ్మవారితో కలిసి పూజిస్తూ ఉండేవాడు. అలా రాముడు శివలింగాలను ప్రతిష్ఠించిన ప్రదేశాలు ఆ తరువాత కాలంలో పుణ్యక్షేత్రాలుగా అలరారుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఆయా క్షేత్రాల్లో పుణ్యతీర్థాలు కూడా దర్శనమిస్తూ ఉంటాయి. వాటిని చూసిన భక్తులు రాతి ప్రదేశాల్లో ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయా అని ఆశ్చర్యపోతుంటారు. అలాంటి వాటిలో కొన్ని జలధారలు రాముడి కారణంగానే భూమిపైకి వచ్చాయని చెబుతుంటారు. సీతమ్మవారి దాహం తీర్చడం కోసం ... అక్కడి ప్రజల దాహం తీర్చడం రాముడు ఈ జలధారలను భూమిపైకి రప్పించాడని అంటారు.

అలాంటి జలధారలు కలిగిన గుట్ట ప్రదేశం మనకి 'జుంటుపల్లి' లో కనిపిస్తుంది. జుంటుపల్లి ... రంగారెడ్డి జిల్లా తాండూరు మండల పరిధిలోకి వస్తుంది. వనవాస కాలంలో సీతారాములు ఈ గుట్టపై కొంతకాలం పాటు ఉన్నారని చెబుతుంటారు. ఆ సమయంలోనే సీతమ్మవారి దాహం తీర్చడం కోసం రాముడు బాణ ప్రయోగంతో రెండు నీటిధారలు సృష్టించినట్టు చెప్పబడుతోంది.

కోనేరుని పోలి కనిపించే ఈ కుండాలను సీతారాముల పేరుతోనే పిలుస్తుంటారు. మహిమాన్వితమైన ఈ కుండాలలో స్నానం చేయడం వలన పాపాలు ... దోషాలు ... వాటి ఫలితంగా బాధించే వ్యాధులు నశిస్తాయని ఇక్కడివారు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.
X

Feedback Form

Your IP address: 54.161.175.236