ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నదీ స్నానం

Thu, Jun 20, 2013, 04:03 PM
Related Image సాధారణంగా పుణ్య క్షేత్రాలన్నీ కూడా నదీ తీరాలవెంటే అలరారుతుంటాయి. అందువలన ఆయా పుణ్య క్షేత్రాలను దర్శించాలనుకునే వారు అక్కడి నదుల్లో స్నానమాచరించి దైవ దర్శనం చేసుకుంటూ వుంటారు. ఇక కార్తీక మాసంలోను ... పుష్కర సమయంలోను ... విశిష్టమైనటువంటి కొన్ని పుణ్య దినాల్లోను నదీ స్నానాలు ఎక్కువగా చేస్తుంటారు.

గంగ ... కృష్ణ ... యమున ... గోదావరి ... నర్మద ... తుంగభద్ర ... గౌతమీ నదీ తీరాల వెంట ఎన్నో పుణ్య క్షేత్రాలు ... మరెన్నో దివ్య క్షేత్రాలు వెలిశాయి. 'గంగానది'లో స్నానం చేయడం వలన పాపాలన్నీ పటాపంచలవుతాయి. 'గోదావరి నది'లో ఒకసారి స్నానం చేయడం వలన వంద సంధ్యా వందనాలు చేసిన పుణ్యఫలం దక్కుతుంది.

ఇక 'నర్మదా నది'లో స్నానం చేసి అనుకున్నవి దానంచేస్తే విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. ఒక్కసారి 'గౌతమీ నది' స్నానం చేయడం వలన అనేక పుణ్య ఫలాలు లభిస్తాయి. 'కృష్ణా నది' స్నానం శ్రీ మహా విష్ణువు అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. 'తుంగభద్ర నది'లో స్నానం చేసినవారికి సత్యలోక ప్రాప్తి కలుగుతుంది. ఇక పుష్కర కాలంలో ఆయా నదుల్లో స్నానం చేయడం వలన విశేషమైన పుణ్య ఫలాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. నదీ స్నానాల ఫలితంగా పుణ్యాన్ని ఆర్జించిన వారంతా సువర్ణముఖీ నదీ తీరంలో జన్మిస్తారనేది రుషి వాక్కు.

ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్య పరంగా కూడా ఈ నదులు ప్రభావం చూపుతాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నదులన్నీ కూడా ఎన్నో ప్రాంతాల మీదుగా ప్రవహించడం వలన ఆ నీటిలో ఎన్నో ఔషధ గుణాలు వుంటాయి. అందువలన నదీ స్నానాలు చర్మ సంబంధమైన వ్యాధుల బారిన పడకుండా కాపాడటమే కాకుండా మరిచిపోలేనటువంటి మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి.
X

Feedback Form

Your IP address: 54.204.247.205