ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తిరునాళ్లు

Thu, Jun 20, 2013, 03:22 PM
Related Image సాధారణంగా ఏదో ఒక దేవాలయం లేకుండా ఏ ఊరూ కనిపించదు. ఇక దేవాలయం ఉన్నప్పుడు ఆ దైవానికి సంబంధించిన కళ్యాణ మహోత్సవాలు ... వార్షికోత్సవాలు మొదలైన వాటి పేరు మీద 'తిరునాళ్లు' జరుగుతూ వుంటాయి. దైవాలకు జరిగే పవిత్ర ఉత్సవాలను తిరునాళ్లు అనీ ... గ్రామదేవతలకు జరిగే ఉత్సవాలను జాతర అని అంటూ వుంటారు.

సాధారణంగా ఈ తిరునాళ్లు మూడు రోజులపాటు గానీ ... అయిదు రోజులపాటు గానీ ... తొమ్మిది రోజుల పాటుగాని అక్కడి ఆచారాలనుబట్టి ఆనవాయతీని బట్టి జరుగుతూ వుంటాయి. చైత్ర - వైశాఖ మాసాల్లో జరిగే ఈ తిరునాళ్లలో బొమ్మలకొట్లు ... మిఠాయి దుకాణాలు విరివిగా కనిపిస్తాయి. ఇక రాత్రి వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయబడతాయి. ఇవి ఉత్సాహాన్ని ... మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. ఊళ్లో వాళ్లంతా కలిసి ఉమ్మడిగా జరుపుకునే ఓ పండుగలా అనిపిస్తాయి.

తమ ఊరి తిరునాళ్లను చూడటం కోసం అత్తవారింట్లో వున్న ఆడపిల్లలు సైతం పుట్టింటికి చేరుకుంటారు. అలాగే నగరాల్లో ఉద్యోగాలు చేసుకునే కుర్రాళ్లు కూడా ఈ సమయంలో తమ ఊరికి చేరుకుంటారు. కట్టుబాట్ల పేరిట నాలుగు గోడల మధ్యన ఉండిపోయే యువతులు కూడా ఈ తిరునాళ్ల సమయంలో బయటికి వస్తారు. దేవుడి కార్యక్రమం కాబట్టి పాత తగాదాలు వున్న వాళ్లంతా వాటిని మరిచిపోయి కలిసిపోయి పనిచేస్తుంటారు. ఇక చుట్టుపక్కల ప్రాంతాల వారు సైతం ఈ తిరునాళ్లకు రావడం కారణంగా కొత్త పరిచయాలు ఏర్పడు తుంటాయి.

ఒకప్పుడు అమ్మాయిలకైనా ... అబ్బాయిలకైనా సంబంధాలు కుదరడానికి ఈ తిరునాళ్లు ఒక వేదికగా ఉపయోగపడేవి. మన వూరు ... మన దేవుడు ... మనమంతా ఒక్కటేననే విషయాన్ని చాటిచెబుతూనే, కలిసికట్టుగా పనిచేయడంలో గల ఆనందాన్ని తెలియజెప్పడమే ఈ తిరునాళ్ల ముఖ్య ఉద్దేశమని చెప్పొచ్చు.
X

Feedback Form

Your IP address: 54.157.225.99