ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

గడప

Thu, Jun 20, 2013, 02:30 PM
Related Image సాధారణంగా ఒక ఊళ్లో జనాభా గురించి తెలుసుకోవలసి వచ్చినప్పుడు ఆ ఊళ్లో ఎన్ని గడపలు వున్నాయనే ప్రస్తావన రావడం మనం చూస్తూ వుంటాం. అంటే గడపలేని ఇల్లు ఉండదని మనకి ఈ విషయం చెబుతోంది. మన పూర్వీకులు భూమికి ... ఆకాశానికి మధ్య హద్దుగా గడపను భావించారు. భూమికి ... ఆకాశానికి మధ్య అన్నట్టుగా గడపపై కూర్చుని హిరణ్య కశిపుడిని నరసింహస్వామి సంహరించిన విషయం తెలిసిందే.

గడప శ్రీ మహాలక్ష్మీ స్థానం ... అందుకనే గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతూ ఉండటం ఆచారంగా వస్తోంది. ఇక ఈ పని చేయకుండా ఏ ఇంట్లో ఏ శుభకార్యం గానీ, పూజా కార్యక్రమంగాని జరగదు. గడపను అమ్మవారి స్థానంగా భావిస్తోన్న కారణంగానే గడపను తొక్కడాన్ని ... గడపపై నిలబడి తుమ్మడాన్ని తప్పుగా భావిస్తుంటారు. గడపకి పసుపు రాయడం వెనుక గల కారణాల్లో ఒకటి పవిత్రత అయితే ... రెండవది ప్రాణరక్షణ అని చెప్ప వచ్చు.

సాధారణంగా పల్లెటూళ్లు పంటపొలాల మధ్యలోనో ... అడవులకు సమీపంలోనో ఉంటూ వుంటాయి. ఈ కారణంగా ఇళ్లలోకి పాములు ... తేళ్లు వంటి విష జంతువులు వస్తూ వుంటాయి. ఇవి పసుపు ఘాటును భరించలేవు కనుక ఆ దరిదాపుల్లోకి రాలేవు. అందువల్లనే గడపలకి పసుపు రాయడం ఆనవాయతీగా వచ్చిందని అంటుంటారు.
X

Feedback Form

Your IP address: 54.163.173.253