ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మహిమ చూపే మహాదేవుడి క్షేత్రం

Wed, Oct 22, 2014, 02:39 PM
Related Image పరమశివుడు ఆవిర్భవించిన పరమ పవిత్రమైన క్షేత్రాల్లో ఒకటి 'బి.అన్నవరం' గ్రామంలో కనిపిస్తుంది. అత్యంత ప్రాచీనమైనదిగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రం నల్గొండ జిల్లా మిర్యాలగూడెం మండలంలో దర్శనమిస్తుంది.

సాధారణంగా ఈ ప్రాంతంలో కాకతీయుల కాలం నాటి శివాలయాలు ఎక్కువగా కనిపిస్తూ వుంటాయి. కాకతీయుల నిర్మాణ శైలి ... వాళ్ల కాలంలో శివలింగాలు రూపొందిన విధానం ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ ఆలయ నిర్మాణ శైలి ... శివలింగాకృతి అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తూ వుంటుంది. అందువలన ఇది కాకతీయుల కాలానికి పూర్వం నాటిదిగా చెప్పబడుతోంది.

ఇక్కడి ఆధారాలపై పరిశోధన జరిగితే ఈ ఆలయానికి సంబంధించిన పూర్తి సమాచారం లభించే అవకాశం వుంది. ఎంతోమంది మహారాజులు ... సంస్థానాధీశులు ... మహాభక్తులు ఇక్కడి స్వామివారి దర్శనం చేసుకుని తరించారని అంటారు. పూర్వం ఈ ప్రాంతం నుంచి 'శ్రీశైలం' వెళ్లే భక్తులు ముందుగా ఇక్కడి సదాశివుడిని దర్శించుకుని వెళ్లేవాళ్లట.

ఈ స్వామిని ముందుగా దర్శించుకోవడం వలన అత్యంత కష్టతరమైన శ్రీశైల ప్రయాణంలో ఎలాంటి ఆపదలు ... ఆటంకాలు సంభవించవని విశ్వసించేవారట. ఎలాంటి ఆపదలైనా ఈ స్వామి దర్శనమాత్రం చేత దూరమవుతాయనే విశ్వాసం ఇప్పటికీ ఇక్కడ బలంగా కనిపిస్తుంది. ఈ కారణంగానే ఆపదలను తొలగించే ఇక్కడి మహాదేవుడిని మహిమాన్వితుడుగా చెప్పుకుంటూ వుంటారు ... కనులారా ఆ స్వామిని దర్శిస్తూ మనసారా సేవిస్తూ వుంటారు.
X

Feedback Form

Your IP address: 54.205.8.87