ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆడపడచులను అనుగ్రహించే మహంకాళి

Wed, Oct 22, 2014, 11:44 AM
Related Image శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు లోకకల్యాణం కోసం వివిధ నామాలతో అనేక రూపాలను ధరించింది. ఆ రూపాలతో అమ్మవారు అనేక ప్రాంతాల్లో ఆవిర్భవించి పూజాభిషేకాలు అందుకుంటోంది. అలా భక్తజనులచే నిత్యనీరాజనాలు అందుకుంటోన్న అమ్మవారి ఆలయం ఒకటి మనకి 'మహంకాళిగూడెం' లో కనిపిస్తుంది.

నల్గొండ జిల్లా నేరేడుచర్ల మండలం పరిధిలో .. కృష్ణానదీ తీరంలో ఈ ఆలయం దర్శనమిస్తుంది. అమ్మవారిపట్ల ఇక్కడివారికి గల భక్తిశ్రద్ధల కారణంగానే ఈ గ్రామానికి ఈ పేరు వచ్చింది. రెండువేల సంవత్సరాల నుంచి ఈ అమ్మవారు ఇక్కడ పూజలు అందుకుంటూ వుండటం విశేషం. ఒకప్పుడు గ్రామదేవతగా పూజలు అందుకున్న ఇక్కడి అమ్మవారు, అనేక మహిమలను భక్తుల అనుభవంలోకి తెచ్చిందట.

కాలక్రమంలో ఆలయం అభివృద్ధి చెందడంతో ... అమ్మవారి మహిమలు వెలుగు చూడటంతో దూరప్రాంతాల నుంచి కూడా ఆ తల్లిని దర్శించుకునేందుకు ఇక్కడికి వస్తుంటారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి తమ గ్రామాన్నీ ... దుష్టశక్తుల బారి నుంచి తమని ఈ అమ్మవారు కాపాడుతూ ఉంటుందని స్థానికులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు. తమ సంతాన సౌభాగ్యాలను అమ్మవారు సదా రక్షిస్తూ ఉంటుందని నమ్ముతుంటారు.

అమ్మవారి అనుమతి ... ఆ తల్లి ఆశీస్సులు లేకుంగా ఇక్కడ ఎవరూ ఎలాంటి శుభాకార్యాన్ని తలపెట్టకపోవడం విశేషం. ప్రతి యేటా అమ్మవారికి అత్యంత వైభవంగా జరిపే ఉత్సవాలకు, ఇక్కడి ఆడపడచులు ఏ ఊళ్లో వున్నా తప్పక వస్తుంటారు. అమ్మవారి వేడుకలో ఆనందంగా పాల్గొంటూ వుంటారు. మహంకాళి అమ్మవారి దర్శనం చేసుకుని .. ఆశీస్సులు అందుకుని ... సంతోషంగా చీరసారెలు సమర్పించి వెళుతూ వుంటారు.
X

Feedback Form

Your IP address: 54.167.142.229