ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆంజనేయుడు

Sat, Oct 18, 2014, 10:24 AM
Related Image జీవితంలో ధైర్యంగా అడుగు ముందుకు వేయాలంటే, మానసికంగా ... శారీరకంగా ఆరోగ్యంగా వుండటం ఎంతో అవసరం. ఆరోగ్యం .. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ... లక్ష్యం దిశగా సాగిపోవడానికి అవసరమైన శక్తిని అందిస్తుంది.

ఏదో సాధించాలనే ఆరాటం వుంటుంది .. కానీ అందుకు ఆరోగ్యం సహకరించక డీలాపడిపోతుంటారు. అలా ఆరోగ్యం విషయంలో సమస్యలు ఎదుర్కుంటున్న వాళ్లు హనుమంతుడిని ఆరాధించడం వలన ఆశించిన ఫలితం కనిపిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. హనుమంతుడి పాదాలను ఆశ్రయించిన ప్రతి భక్తుడు కోరుకునేది ఆరోగ్యాన్నే.

ఈ కారణంగానే స్వామివారి ఆలయాలు భక్తజన సందోహంతో కళకళలాడుతూ కనిపిస్తుంటాయి. అలాంటి ఆలయాలలో ఒకటి 'వెంకటాపురం' లో కనిపిస్తుంది. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో ఈ గ్రామం కనిపిస్తుంది. ఇక్కడి 'దాసాంజనేయ స్వామి' ప్రాచీనకాలం నుంచి పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. అనారోగ్యంతో బాధలు పడుతున్న వాళ్లు ఇక్కడి స్వామిని దర్శించుకోవడం వలన మంచి ఫలితం కనిపిస్తుందని చెబుతుంటారు.

పాపాల ఫలితంగా పీడించే వ్యాధులు ... గ్రహ సంబంధమైన దోషాలు ... దుష్ట ప్రయోగాలు సృష్టించే సమస్యల నుంచి ఈ స్వామి విముక్తి కల్పిస్తాడని విశ్వసిస్తుంటారు. ప్రతి మంగళవారం ... శనివారం స్వామివారిని దర్శించే భక్తుల సంఖ్య ఎక్కువగా వుంటుంది. చేతులు జోడించి నమస్కరించిన భక్తుడికి ఆశీస్సుతోనే ఆరోగ్యాన్ని ప్రసాదించే ఇక్కడి స్వామివారిని దర్శించి తీరాలి.
X

Feedback Form

Your IP address: 54.146.177.118