ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సూర్యడు ఇలా ప్రసన్నుడవుతాట !

Tue, Oct 07, 2014, 01:46 PM
Related Image జీవితంలో ఏదైనా అనుకోని కష్టం వచ్చినప్పుడు '' ఏం చేస్తాం ... గ్రహస్థితి బాగోలేదు '' అని అంటూ వుండటం జరుగుతుంది. అంటే గ్రహస్థితి బాగా ఉన్నంతవరకూ జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుందని భావిస్తుంటారు. ఇక గ్రహ స్థితి బాగోలేకపోతే ఆనందకరమైన జీవితం అల్లకల్లోలమైపోతుందని విశ్వసిస్తుంటారు.

జాతక చక్రంలో గ్రహస్థితి సరిగ్గా లేకపోవడం వలన అనేక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అందువలన ఆయా గ్రహాల స్థితి సరిగ్గా లేనివాళ్లు వాటిని శాంతింపజేసుకుని, వాటి అనుకూలతను పొందడానికి ప్రయత్నిస్తుంటారు. జాతకంలో రవి స్థితి బాగోలేని వాళ్లు నానారకాల సమస్యలను ఎదుర్కుంటూ వుంటారు. బంధుమిత్రులతో గొడవలు పడటం ... పై అధికారుల ఆగ్రహానికి గురికావడం ... నమ్మినవారి మోసానికి గురికావడం జరుగుతూ వుంటుంది.

ఈ కారణంగా సమస్యలన్నీ చుట్టుముట్టిన సమయంలో ఒంటరిగా మిలిపోతుంటారు. తమకి ఎవరూ లేరు ... తాము ఎవరికీ ఏమీ కాము అనే నిరాశా నిస్పృహలు అలుముకుంటాయి. సూర్యుడు చూపే ప్రతికూలత కారణంగానే ఈ కష్టాలు అనుభవించడం జరుగుతూ వుంటుంది కాబట్టి, ఆయన నుంచి అనుకూలత పొందడానికి ప్రయత్నం చేయాలని శాస్త్రం చెబుతోంది.

సూర్యుడి అనుగ్రహాన్ని .. ఆయన నుంచి అనుకూల ఫలితాలు పొందడానికి కొన్ని మార్గాలు వున్నాయి. 'తెల్లజిల్లేడు చెట్టు'ను పూజించడం అనేది వాటిలో ఒకటిగా కనిపిస్తుంది. తెల్లజిల్లేడు చెట్టును పూజించడం వలన సూర్యుడు ప్రసన్నుడవుతాడని చెప్పబడుతోంది. రవి అనుగ్రహం వలన ఆ గ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోతాయని స్పష్టం చేయడం జరుగుతోంది.
X

Feedback Form

Your IP address: 54.197.90.95