ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

గడపపై తలపెట్టుకుని పడుకోవచ్చా ?

Mon, Oct 06, 2014, 06:48 AM
Related Image పూర్వం ఒక గ్రామంలో ఎన్ని ఇళ్లు వున్నాయో చెప్పే సందర్భాల్లో, ఇన్ని గడపలు వున్నాయని లెక్క తేల్చే వాళ్లు. అలాగే ఎవరైనా పేరంటానికి పిలవడానికి వచ్చినప్పుడు ఆ ఇంటి ఇల్లాలు లేకపోతే గడపకి 'బొట్టు' పెట్టేసి వెళుతుంటారు. దీనిని బట్టి గడపకి ఎంతటి ప్రాధాన్యత వుందో అర్థం చేసుకోవచ్చు.

గడపని శుభ్రంగా ఉంచడం ... పసుపురాసి కుంకుమ బొట్లు పెడుతూ వుండటం ప్రాచీనకాలం నుంచి వస్తోంది. అలాంటి గడపపై కూర్చున్నా ... నుంచున్నా ... గడపపై తలపెట్టి పడుకున్నా పెద్దలు తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తుంటారు. మరోసారి అలా చేయకూడదని మందలిస్తుంటారు. గడపకి అంతటి ప్రాముఖ్యతను ఇవ్వడానికి గల కారణమేమిటో ఈ కాలం పిల్లల్లో చాలామందికి తెలియదు.

అందువల్లనే కొంతమంది గడప మీద కూర్చుని ఇతరులతో కబుర్లు చెబుతుంటారు. కొంతమంది గడపను దాటకుండా దానిపై కాలుపెట్టి వెళుతుంటారు ... ఒక్కోసారి అలా దానిపై నుంచుంటారు కూడా. ఇక మరి కొంతమంది గడపపై తలపెట్టి పడుకుని ఏవో పుస్తకాలు చదువుతూ వుంటారు ... అవసరమైతే అలాగే పడుకుంటారు. ఈ పద్ధతి ఎంతమాత్రం మంచిదికాదని శాస్త్రం చెబుతోంది.

గడప శ్రీమన్నారాయణుడి స్థానం ... నరసింహస్వామిగా ఆయన అక్కడ కూర్చునే హిరణ్యకశిపుడిని వధించడం జరిగింది. ఇక నారాయణుడు ఎక్కడ ఉంటాడో అక్కడే లక్ష్మీదేవి కూడా కొలువై వుంటుంది. అందువలన గడప లక్ష్మీదేవి స్థానంగా కూడా చెప్పబడుతోంది. ఈ కారణంగానే గడపను పసుపు కుంకుమలతో అలంకరిస్తూ వుంటారు. అందువల్లనే గడపపై కూర్చోవడం ... నుంచోవడం ... తలపెట్టి పడుకోవడం వంటివి చేయకుండా, దానిని పవిత్రంగా చూసుకోవాలని శాస్త్రం చెబుతోంది.
X

Feedback Form

Your IP address: 54.205.150.215