ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

విజయాలను ప్రసాదించే విజయదుర్గ

Mon, Sep 29, 2014, 04:04 PM
Related Image ఆదిపరాశక్తి అయిన అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి నవరాత్రులనేవి అశేష భక్త జనావళికి లభించిన అమూల్యమైన వరాలుగా చెప్పవచ్చు. ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారు ధరించే వివిధ రూపాలను భక్తులు దర్శిస్తూ ... తరిస్తూ వుంటారు. ఇక పదవరోజున అంటే 'దశమి' రోజున అమ్మవారు రాజరాజేశ్వరీ దేవిగా పూజాభిషేకాలు అందుకుంటుంది. ఈ రోజున అమ్మవారికి ఇష్టమైన పులిహోర ... లడ్డు నైవేద్యంగా సమర్పిస్తూ వుంటారు.

లోకకల్యాణం కోసం తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రూపాల్లో తొమ్మిదిమంది రాక్షసులను అమ్మవారు సంహరిస్తుంది. అమ్మవారు సాధించిన విజయానికి గుర్తుగా ఆ తల్లిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే రోజు విజయదశమిగా పిలవబడుతోంది. శ్రవణా నక్షత్రం ... దశమి తిథి కలిసిన రోజే విజయదశమిగా చెప్పబడుతోంది. ఈ రోజున ఆయుధపూజ నిర్వహించడం ప్రాచీనకాలం నుంచి వస్తోంది.

అజ్ఞాతవాస సమయంలో పాండవులు తమ ఆయుధాలను భద్రంగా 'శమీవృక్షం'పై దాచిపెడతారు. తమకి విజయం చేకూరడం కోసం ఆయుధాలను పూజిస్తారు. ఈ కారణంగానే అందరికీ విజయం కలగాలనే ఉద్దేశంతో విజయదశమి రోజున శమీ వృక్షాన్ని పూజించడం జరుగుతోంది. ''శమీ శమయతే పాపం శమీ శతృవినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనః '' అంటూ శమీ వృక్షాన్ని పూజిస్తారు.

ఈ రోజున సంధ్యాకాలంలో అమ్మవారు 'అపరాజితాదేవి'గా దర్శనమిస్తుంది. ఈ సమయాన్నే విజయ ముహూర్తమని చెబుతుంటారు. ఈ సమయంలో ప్రారంభించిన ధర్మబద్ధమైన కార్యాలు విజయదుర్గ అనుగ్రహంతో విజయవంతమవుతాయని చెప్పబడుతోంది.
X

Feedback Form

Your IP address: 50.16.52.237