ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కూష్మాండ దుర్గకి ప్రీతికరమైన నైవేద్యం

Sat, Sep 27, 2014, 08:26 PM
Related Image దేవీ నవరాత్రులలో అమ్మవారు ఒక్కో రూపంలో ఒక్కో నామంతో దర్శనమిస్తూ వుంటుంది. ఈ నేపథ్యంలో ఒక్కో అమ్మవారికి ఒక్కో నైవేద్యం ఇష్టమైనదిగా చెప్పబడుతోంది. శైలపుత్రికి 'కట్టుపొంగలి' ... బ్రహ్మచారిణికి 'పులిహోర' ... చంద్రఘంటాదేవికి 'కొబ్బరి అన్నం' నైవేద్యంగా సమర్పించిన భక్తులు, కూష్మాండ దుర్గకి 'అల్లంగారెలు' నైవేద్యంగా సమర్పిస్తుంటారు. అయితే ఈ గారెలకి రంధ్రాలు చేయకూడదనే నియమం కనిపిస్తుంది.

నవరాత్రులలో నాల్గొవ రోజున అమ్మవారిని 'కూష్మాండ దుర్గ' గా అలంకరించి పూజిస్తుంటారు. ఈ అమ్మవారు పులిని వాహనంగా కలిగి వుంటుంది. అమ్మవారికి గల ఎనిమిది చేతులు ఆమె శక్తికి నిదర్శనంగా కనిపిస్తూ వుంటాయి. ఈ ఎనిమిది చేతుల్లో విల్లు .. బాణం .. చక్రం .. గద .. తామరపువ్వు .. జపమాల .. కమండలం .. అమృత కలశం కనిపిస్తూ వుంటాయి.

చిరునవ్వులు చిందిస్తూ అమ్మవారి వదనం ప్రసన్నంగా కనిపిస్తూ వుంటుంది. అలాంటి ఈ తల్లికి అల్లం గారెలు అత్యంత ప్రీతికరమైనవిగా చెప్పబడుతున్నాయి. సన్నజాజి పూలమాలికలతో అమ్మవారిని అలంకరించి ... ఆరాధించి .. ఆమెకి ఇష్టమైన అల్లం గారెలను నైవేద్యంగా పెట్టడం వలన ఆ తల్లి సంతోషిస్తుందని చెబుతారు. ఈ అమ్మవారి అనుగ్రహం వలన సమస్త దోషాలు నశించి, సకల శుభాలు చేకూరతాయని చెప్పబడుతోంది.
X

Feedback Form

Your IP address: 184.73.122.162