ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

బ్రహ్మచారిణిగా అమ్మవారిని ఇలా సేవించాలి

Thu, Sep 25, 2014, 10:33 PM
Related Image శరన్నవరాత్రులలో నవదుర్గల ఆరాధన వలన విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఆదిపరాశక్తి అయిన అమ్మవారి ఆలయాలలో ఆ తల్లిని ఒక్కోరోజున ఒక్కోరూపంగా అలంకరించి ... ఒక్కోనామంతో పూజించడం జరుగుతుంటుంది. ఈ నేపథ్యంలో నవరాత్రులలో రెండవ రోజైన 'విదియ' రోజున అమ్మవారిని 'బ్రహ్మచారిణి'గా అలంకరించి కొలుస్తుంటారు.

సదాశివుడిని భర్తగా పొందడం కోసం అమ్మవారు వేల సంవత్సరలపాటు కఠోర తపస్సును ఆచరించింది. ఈ కారణంగానే అమ్మవారి చేతిలో జపమాల ... కమండలం కనిపిస్తూ వుంటాయి. ఈ అమ్మవారిని వివిధ రకాల పూలతో అలంకరిస్తుంటారు. అయితే జాజిపూలు ... తులసి దళాలతో కట్టిన మాలతో అమ్మవారిని అలంకరించడం వలన ఆమెకి ప్రీతిపాత్రులవుతారని చెప్పబడుతోంది. ఈ అమ్మవారికి 'పులిహోర' అంటే చాలా ఇష్టం కనుక దానినే నైవేద్యంగా సమర్పించడం జరుగుతూ ఉంటుంది.

'' దధనాకర పద్మాభ్యం అక్షమాలా కమండలా .. దేవీ ప్రసాదతు మయి బ్రహ్మచారిణ్య నుత్తమా '' అంటూ అమ్మవారిని ఆరాధించడం వలన ఆ తల్లిమనసు వెన్నలా కరిగిపోతుందని చెప్పబడుతోంది. అమ్మవారి అనుగ్రహం వలన జీవితంలో వెంటాడుతూ వస్తోన్న సమస్యలు తొలగిపోయి సంతోషాలు కలుగుతాయని స్పష్టం చేయబడుతోంది.
X

Feedback Form

Your IP address: 54.163.94.5