ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తిరుమలను పోలిన బాలాజీ క్షేత్రం

Mon, Sep 22, 2014, 02:51 PM
Related Image సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే భూలోకానికి దిగివచ్చి వేంకటేశ్వరుడుగా ఆవిర్భవించిన పరమపవిత్రమైన క్షేత్రం 'తిరుమల'. ఈ క్షేత్రంలో అడుగుపెట్టాలన్నా ... ఇక్కడి స్వామిని దర్శించుకోవాలన్నా పూర్వజన్మ పుణ్యం వెంటరావాలి. నిరంతరం స్వామివారి దర్శనం కోసం లక్షలాదిమంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తుంటారు. ఆ ఏడుకొండలవాడిని దర్శించుకుని మురిసిపోతుంటారు.

ఇక్కడి స్వామిని అనునిత్యం దర్శించుకోవాలనే ఉద్దేశంతో కొంత్తమంది భక్తులు ఆయా ప్రాంతాల్లో ఆలయాలను నిర్మించి, అచ్చు తిరుమల వేంకటేశుడిని పోలిన ప్రతిమను ప్రతిష్ఠించుకున్న సందర్భాలు ఎన్నో కనిపిస్తాయి. ఈ నేపథ్యంలో ఒక భక్తుడు తిరుమల స్వామివారినే కాదు, తిరుమల ఆలయాన్ని పోలిన ఆలయాన్నే నిర్మించాడు.

వేంకటేశ్వర హేచరీస్ అధినేత అయిన బి.వి.రావు ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. పూణే - 'కేట్కావాలా' గ్రామంలో ఈ క్షేత్రం అలరారుతోంది. ఎత్తయిన కొండల మధ్య కోట్ల రూపాయలతో నిర్మించబడిన ఈ ఆలయం ఆయన భక్తి శ్రద్ధలకు నిదర్శనమై దర్శనమిస్తుంది. అడుగడుగునా సౌందర్యం ఉట్టిపడుతోన్న రూపంతో భారీగా కొలువైన ఇక్కడి స్వామివారిని 'బాలాజీ' గానే భక్తులు పిలుస్తుంటారు.

ఈ క్షేత్రంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి తిరిగి వచ్చేంత వరకూ కూడా తిరుమలలో వున్నామనే అనుభూతే కలుగుతూ ఉంటుంది. భక్తులకు ఆనందాశ్చర్యాలను కలిగిస్తూ, ఆధ్యాత్మిక భావాలను వికసింపజేసే ఈ క్షేత్రాన్ని చూసితీరవలసిందే. ఈ స్వామికి ఘనంగా జరిగే వివిధ సేవలను కనులారాదర్శిస్తూ ధన్యులు కావలసిందే.
X

Feedback Form

Your IP address: 54.161.168.21