ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సీతారాములను కనిపెట్టుకునుండే సర్పం

Sat, Sep 20, 2014, 10:44 AM
Related Image సాధారణంగా మహర్షుల కాలంలో ఆవిర్భవించిన దైవమూర్తులు కొన్నికారణాల వలన మరుగునపడిపోతుంటాయి. ఆ తరువాత ఆ దైవం తన భక్తుల కలలో కనిపించి తన జాడను తెలపడం ... వెలుగులోకి రావడం జరుగుతూ ఉంటుంది.

అయితే ఆకాశం నుంచి దివ్యమైన తేజస్సుగా వచ్చి ఆవిర్భవించిన స్వామి, వెంటనే ఆ విషయాన్ని తన భక్తుడికి స్వప్నం ద్వారా తెలియపరచిన సంఘటన మనకి 'కవాడపల్లి' క్షేత్రంలో కనిపిస్తుంది. హైదరాబాద్ - హయత్ నగర్ మండలం పరిధిలో ఈ క్షేత్రం దర్శనమిస్తుంది.

ఇక్కడి గుట్టపైకి ఒక రాత్రివేళ దివ్యమైన తేజస్సు దిగుతూ ఉండటం కొంతమందికి కనిపిస్తుంది. అదే సమయంలో ఒక భక్తుడి కలలో రాముడు కనిపించి తాను ఇక్కడ వెలసినట్టుగా చెప్పడం జరుగుతుంది. రాత్రి ఆ తేజస్సు చూసినవాళ్లు అదేమిటో తెలుసుకోవడం కోసం ... కలలో రాముడు కనిపించిన వ్యక్తి అది నిజమో భ్రమో తెలుసుకోవడం కోసం మరునాడు ఉదయాన్నే గుట్టపైకి చేరుకుంటారు.

అక్కడ వారికి కొండరాళ్ల మధ్య వెలసిన సీతారాములు కనిపిస్తారు. ఆ రోజు నుంచి ఈ క్షేత్రం తన ప్రత్యేకతను చాటుకుంటూ అభివృద్ధి చెందుతూ వస్తోంది. ఇక్కడ సీతారాములకు ... లక్ష్మీనారాయణుల మాదిరిగా ఆదిశేషుడు తన పడగను గొడుగులా పట్టిన ముద్ర బండరాయిపై స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఆదిశేషుడు ఈ క్షేత్రాన్ని కనిపెట్టుకుని ఉంటాడని అర్చకులు చెబుతుంటారు. ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టకుండా ఈ పరిసరాల్లో ఒక సర్పం సంచరిస్తూ ఉండటమే ఇందుకు నిదర్శనమని అంటారు.
X

Feedback Form

Your IP address: 50.16.17.16