ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

బాధలను తీర్చేటి బంగారు మైసమ్మ

Mon, Sep 15, 2014, 10:16 AM
Related Image ఆదిపరాశక్తి అయిన అమ్మవారు అనేక ప్రాంతాలలో వివిధ నామాలతో గ్రామదేవతగా ఆవిర్భవిస్తూ తన బిడ్డలను కాపాడుతూ వస్తోంది. ఆమె మానవ జన్మనెత్తి ... ఆ తరువాత గ్రామదేవతగా మారిన సందర్భాలు కూడా లేకపోలేదని గ్రామస్తులు చెబుతుంటారు. అలాంటి విశ్వాసానికి నిదర్శనంగా 'కళ్ళేపల్లి'లోని 'బంగారు మైసమ్మ' ఆలయం కనిపిస్తుంది. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం పరిధిలో ఈ ఆలయం అలరారుతోంది.

పూర్వం ఇక్కడి నుంచి అయిదు కుటుంబాలకి చెందిన కొంతమంది వ్యవసాయదారులు ఇతర ప్రాంతాలకి వెళ్లి, అక్కడ తమ పంటను అమ్మకం జరిపి తిరిగివచ్చేవాళ్లట. అలా ఒకసారి వాళ్లు వెళ్లివస్తూ భోజనం చేయడానికి ఒక వ్యవసాయ బావి దగ్గర ఆగారట. ఆ సమయంలోనే ఆ బృందానికి చెందిన 'బంగారమ్మ' అనే బాలిక ఆ బావిలో పడి చనిపోతుంది.

వాళ్లంతా బాధపడుతుండగా ఆ బావిలో నుంచి ఒక దివ్యమైన తేజస్సు బయటికి వచ్చి, తాను చనిపోలేదనీ ఇకపై అమ్మవారిగా పూజలందుకోవడం కోసం ఆ దేహాన్ని విడిచి పెట్టానని అంటుంది. తాను కళ్ళేపల్లి లోని తమ వ్యవసాయ క్షేత్రంలో వెలుస్తున్నాననీ ... తనకి ఆలయాన్ని నిర్మించి భక్తులకి దర్శన భాగ్యం కలిగించమని చెబుతుంది.

అక్కడి నుంచి వచ్చిన వారికి నిజంగానే ఆ పొలంలో ఒకచోట బంగారమ్మను పోలిన ప్రతిమ కనిపిస్తుంది. దాంతో ఈ అయిదు కుటుంబాల వాళ్లు ఆమెకి ఆలయాన్ని నిర్మించి 'బంగారు మైసమ్మగా పూజించడం ప్రారంభిస్తారు. చెప్పుకున్న వెంటనే ఈ తల్లి బాధలను తీరుస్తుందనీ .. కోరిన వరాలను ప్రసాదిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు.

జిల్లాలోనే అతిపెద్ద మైసమ్మ ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం 'మే' మాసంలో ఘనంగా జాతర నిర్వహిస్తుంటారు. లక్షలాది మంది భక్తులు ఈ జాతరలో పాల్గొంటారు. ప్రతియేటా పెరుగుతున్న భక్తులు ... ఆలయం యొక్క ఆదాయం, ఆ తల్లి మహిమలకు ... ఆమె పట్ల భక్తులకు గల విశ్వాసానికి నిదర్శనమై నిలుస్తోందని చెప్పవచ్చు .
X

Feedback Form

Your IP address: 184.73.107.18