ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మహాదేవుడు కొలువైన ప్రాచీన క్షేత్రం

Sat, Sep 06, 2014, 10:02 AM
Related Image కాకతీయుల పరిపాలనా కాలంలో శైవ దేవాలయాల నిర్మాణం విస్తారంగా జరిగింది. తమకి పూర్వం నిర్మించబడిన ఆలయాలను అభివృద్ధి చేయడంలోను, కొత్తగా శివాలయాలను నిర్మించడంలోను కాకతీయులు చేసిన కృషి అంతా ఇంతా కాదు. ఆ ఆలయాల నిర్మాణాన్ని పరిశీలిస్తే, శివుడిపట్ల వారికి గల భక్తిశ్రద్ధలు ఎంతటివో అర్థమవుతూ వుంటాయి.

అలా కాకతీయుల పరిపాలనా కాలంలో నిర్మించబడిన శివాలయం మనకి 'రుద్రవరం'లో కనిపిస్తుంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో ఈ క్షేత్రం అలలరారుతోంది. రుద్రమదేవి తన పరిపాలనాకాలంలో ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఓ కోటను నిర్మించాలని నిర్ణయించుకుందట. అలా అప్పట్లో చాలావరకూ పూర్తయిన కోట ఇప్పుడు ఇక్కడ శిధిలావస్థలో కనిపిస్తూ వుంటుంది.

అదే సమయంలో ఇక్కడ దర్శించుకోవడానికిగాను ఆమె ఒక శివాలయాన్ని కూడా నిర్మింపజేసిందట. ఆ స్వామి నిత్యపూజలు అందుకుంటూ భక్తులను అనుగ్రహిస్తూ వుంటాడు. రుద్రుడు కొలువైన కారణంగా ... రుద్రమదేవి ప్రతిష్ఠించిన కారణంగా ఈ గ్రామానికి 'రుద్రవరం' అనే పేరు వచ్చినట్టు చెబుతారు. వాడుకలో ఈ గ్రామాన్ని 'రుద్రారం'గా పిలుచుకుంటూ వుంటారు.

ఇక్కడ లభిస్తోన్న శాసన ఆధారాలు మనల్ని రుద్రమదేవి కాలానికి తీసుకువెళతాయి. ఇక విచారించదగిన విషయం ఏమిటంటే ఈ ఆలయం కూడా గుప్తనిధుల పేరుతో తవ్వకాలకు గురికావడం. ఈ కారణంగా ఆలయం పాక్షికంగా దెబ్బతిన్నా గత చరిత్రకు ... ఘనచరిత్రకు ఇది నిదర్శనమై నిలుస్తోంది. ఇక్కడి స్వామివారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తూ వుంటారు ... ఆయన అనుగ్రహాన్ని అందుకుంటూ తరిస్తుంటారు.
X

Feedback Form

Your IP address: 50.16.17.16