ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అడవిలో కొలువైన దేవుళ్లు

Thu, Aug 28, 2014, 08:01 PM
Related Image ఒకప్పుడు అది దట్టమైన అడవీ ప్రాంతం ... ఆ అడవిలో చెన్నకేశవస్వామి ... ఈశ్వరుడు ... సూర్యభగవానుడు ... గణపతి ... సుబ్రహ్మణ్యస్వామి ... హనుమంతుడు ... కొలువుదీరి కనిపిస్తుంటారు. ఈ కారణంగానే ఈ క్షేత్రానికి అడవిదేవుళ్లపల్లి అనే పేరు వచ్చింది. కాలక్రమంలో అది 'అడవిదేవులపల్లి'గా ప్రసిద్ధి చెందింది.

ఈ ప్రదేశంలో ఇంతటి అందమైన దేవాలయాలు ఉన్నాయా ? అని ఆశ్చర్యాన్ని కలిగించేలా ఈ ప్రాచీన క్షేత్రం నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలో దర్శనమిస్తూ వుంటుంది. ప్రధాన దైవాలుగా చెన్నకేశవుడు ... ఈశ్వరుడు అలరారుతోన్న కారణంగా ఈ క్షేత్రాన్ని చెన్నకేశ్వర క్షేత్రంగా పిలుస్తుంటారు. ఇక్ష్వాకులు ... విష్ణుకుండినీలు ... కల్యాణీ చాళుక్యులు ... ఈ క్షేత్రం అభివృద్ధికి తమవంతు కృషి చేసినట్టుగా స్థలపురాణం చెబుతోంది.

ఆయా మ్యూజియాలలో ఈ రాజుల కాలం నాటి శాసనాలు ఉన్నాయట. తమ రాజ్యంలోని ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండటం కోసం ... తమకి విజయాలను చేకూర్చడం కోసం ఆనాటి రాజులు ఈ ఆలయాలను నిర్మించినట్టు ఆధారాలు చెబుతున్నాయి. కోణార్క్ సూర్య దేవాలయం ... అరసవిల్లి సూర్యదేవాలయం తరువాత స్థానం ఇక్కడి సూర్యనారణమూర్తి ఆలయానికి దక్కుతుందని చెబుతుంటారు.

ఇక్కడి సూర్యదేవుడి తేజస్సు ... శిల్పకళా వైభవంతో ఉట్టిపడే ఆలయ నిర్మాణం ఆనందాశ్చర్యాలను కలిగిస్తుంది. ఈ స్వామిని దర్శించడం వలన వివిధ రకాల చర్మవ్యాధులు నశిస్తాయని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు. ఆధ్యాత్మిక ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నట్టుగా కనిపించే ఈ ఆలయాల సముదాయాన్ని దర్శించడం వలన ఆహ్లాదం కలుగుతుంది ... సంతోషంతో కూడిన సంతృప్తి మిగులుతుంది.
X

Feedback Form

Your IP address: 50.16.52.237