ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తెల్లని పూలతో పూజిస్తే కలిగే ఫలితం !

Tue, Aug 26, 2014, 07:48 PM
Related Image భగవంతుడి అనుగ్రహాన్ని పొందాలంటే అనునిత్యం ఆయనని పూజించాలి ... అంకితభావంతో సేవించాలి. ప్రశాంతతను అలవరచుకుంటూ ... పవిత్రతను పెంపొందింపజేసుకుంటూ భగవంతుడికి నచ్చే విధంగా నడచుకోవాలి. దైవానికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించడమే కాకుండా ... ఆయనకి ఎంతో ఇష్టమైన పూలను పూజలో ఉపయోగించాలి.

ఇలా భగవంతుడి మనసు గెలుచుకోవడం వలన ఆయన భక్తులకు వశపడిపోతాడు .. అనతికాలంలోనే అనుగ్రహాన్ని కలిగిస్తాడు. అలాగే నవగ్రహాలను కూడా వాటికి ఇష్టమైన పూలతో పూజించి అనుగ్రహాన్ని పొందవచ్చని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. నవగ్రహాలలో ఒక్కో గ్రహానికి ఒక్కో వర్ణంలో గల పూలు ప్రీతికరమైనవిగా పేర్కొనబడ్డాయి. ఈ నేపథ్యంలో చంద్రగ్రహానికి 'తెల్లని వర్ణం'లో గల పూలు ప్రీతికరమైనవిగా చెప్పబడుతున్నాయి.

చంద్రగ్రహ సంబంధమైన దోషాలతో ఇబ్బందులు పడుతోన్నవాళ్లు, ఆయనని తెల్లని వర్ణంలో గల పూలతో పూజించడం మంచిదని చెప్పడం జరుగుతోంది. ఈ విధంగా చేయడం వలన చంద్రుడు సంతోషపడిపోతాడు ... సంతృప్తి చెందుతాడు. ఫలితంగా చంద్రగ్రహ సంబంధమైన దోషాలతో బాధలుపడుతున్నవాళ్లకి ఆశించిన ఫలితం లభిస్తుందని అంటారు.
X

Feedback Form

Your IP address: 54.159.231.135