ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వ్యాధులను నివారించే అమృతకుండం

Tue, Aug 12, 2014, 08:37 PM
Related Image పూర్వజన్మలో చేసుకున్న పాపాలే వ్యాధుల రూపంలో పట్టి పీడిస్తూ ఉంటాయని అంటారు. అలా వివిధరకాల వ్యాధులతో బాధలుపడుతున్నవాళ్లు, ఎన్నో రకాల ఔషధాలు స్వీకరిస్తూ వుంటారు. అయినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో, ఇక ఈ జీవితం ఇంతే అన్నట్టుగా నిరాశా నిస్పృహలతో కాలం గడుపుతూ వుంటారు. ఫలానా క్షేత్రానికి ఫలానా మహాత్మ్యం ఉందనీ, అక్కడికి వెళ్లడం వలన ఆ వ్యాధి నివారించబడుతుందని ఎవరైనా చెబితే వెంటనే అక్కడికి వెళుతూ వుంటారు.

అలా చర్మసంబంధమైన వ్యాధులు నివారించబడే క్షేత్రంగా 'కేతకీ సంగమేశ్వరస్వామి క్షేత్రం' పేరు వినిపిస్తూ వుంటుంది. ప్రాచీనమైనదిగా ... మహిమాన్వితమైనదిగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రం, జహీరాబాద్ సమీపంలో విలసిల్లుతోంది. ఇక్కడి ' అమృత కుండం' లోని నీరు మహిమాన్వితమైనదనీ ... ఈ నీటిలో స్నానం చేయడం వలన చర్మసంబంధమైన వ్యాధులు నివారించబడతాయని స్థలపురాణం చెబుతోంది.

సూర్య వంశానికి చెందిన ఒక రాజు చర్మసంబంధమైన వ్యాధితో ఎంతగానో బాధపడుతూ ఉండేవాడట. ఒకసారి ఆయన వేటకోసం ఈ ప్రదేశానికి వచ్చి, అలసిపోయిన కారణంగా ఇక్కడి కుండంలోని నీటితో దాహం తీర్చుకుని స్నానం చేశాడట .. అంతే ఆయన చర్మవ్యాధి తగ్గిపోయింది. అప్పటి నుంచి ఈ కుండం అమృతకుండంగా పిలవబడుతోందని చెబుతారు. అష్ట తీర్ధాలకు చెందిన జలధారలు ఈ కుండంలో కలుస్తూ ఉండటం వల్లనే ఈ కుండం ఇంతటి విశిష్టతను సంతరించుకుందని అంటారు.
X

Feedback Form

Your IP address: 54.166.74.94