ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అష్టమిరోజున అమ్మవారి ఆరాధన !

Mon, Aug 04, 2014, 03:24 PM
Related Image సాధారణంగా అష్టమి రోజున ఎవరూ ఎలాంటి ప్రయాణాలు కానీ,ముఖ్యమైన పనులను పారంభించడంగాని పెట్టుకోరు. ఈ రోజున ఆలయాలకి వెళ్లే భక్తుల సంఖ్య కూడా చాలా తక్కువగా కనిపిస్తుంది. ఇంట్లోని పూజా మందిరం దగ్గర కూడా అష్టమి కదా అనే ఉద్దేశంతో పూజ అయిందనిపించే వాళ్లూ లేకపోలేదు. అలాంటి అష్టమి ... అమ్మవారి అనుగ్రహాన్ని అందిస్తుందని చెప్పబడుతోంది.

అష్టమి తిథి ... అమ్మవారికి అత్యంత ఇష్టమైనదిగా ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అమ్మవారు ఏ క్షేత్రంలో .. ఏ రూపంలో వున్నా .. ఏ పేరుతో పిలవబడుతున్నా ఈ రోజున తప్పక దర్శించాలి ... అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాలి. అమ్మవారికి ప్రీతికరమైన అష్టమి రోజున, ఎవరైతే ఆ తల్లిని మనస్పూర్తిగా సేవిస్తారో వాళ్లని కంటికి రెప్పలా కాపాడుతుంది. అందువలన ఈ రోజున అమ్మవారిని షోడశ ఉపచారాలతో పూజించాలి ... ప్రేమానురాగాలతో సేవించాలి.

అష్టమి అంటే అమ్మవారికి ఇష్టం కనుక ... ఆమె ఆరాధనలోను ఎనిమిది సంఖ్యకు ప్రాధాన్యత వుంటుంది. అందువలన ఎనిమిది ప్రదక్షణలు చేయడం ... ఎనిమిది రకాల ఫలాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం చేయాలి. ఈ విధంగా అమ్మవారికి సంతోషాన్ని ... సంతృప్తిని కలిగించడం వలన ఆ తల్లి ఆపదల నుంచి కాపాడుతుందనీ ... శుభాలను ప్రసాదిస్తుందని చెప్పబడుతోంది.
X

Feedback Form

Your IP address: 54.197.66.254