ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సుఖసంతోషాలనిచ్చే శివలింగ పూజ

Mon, Aug 04, 2014, 12:25 PM
Related Image సదాశివుడి క్షేత్రాలను సదా దర్శిస్తూ వుండాలి ... సదా ఆయన నామాన్ని స్మరిస్తూ వుండాలి. వివిధ రకాల అభిషేక ద్రవ్యాలతో అభిషేకిస్తూ తరిస్తూ వుండాలి. ఒక్కో అభిషేక ద్రవ్యంతో స్వామిని ఆరాధించడం వలన ఒక్కో ఫలితం కలిగినట్టుగానే, ఒక్కో విధమైన శివలింగాన్ని అర్చించడం వలన కూడా ఒక్కో పుణ్యఫలం కలుగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

ఎవరి జీవితం కూడా వడ్డించిన విస్తరిలా వుండదు. ఏవో సమస్యలు ... ఇంకేవో ఇబ్బందులు వుంటూనే వుంటాయి. అలాంటివాళ్లు తమకి కావలసినవి పొందడంకోసం, అందుకు సంబంధించిన అనుకూల ఫలితాలను ఇచ్చే శివలింగాలను పూజిస్తుంటారు. ఈ నేపథ్యంలో మట్టితో ... పిండితో ... గోమయంతో ... బెల్లంతో చేసిన శివలింగాలను ఆరాధించడం జరుగుతుంటుంది.

సాధారణంగా అనారోగ్యంతో ... ఆర్ధిక ఇబ్బందులతో బాధలుపడుతున్నవాళ్లు వాటి నుంచి బయటపడటానికి, అందుకు సంబంధించిన ఫలితాలను ఇచ్చే శివలింగాలను ఆరాధిస్తూ వుంటారు. ఇక ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా జీవితం సాఫీగా సాగిపోవాలంటే, ఏ విధమైన శివలింగాన్ని పూజించాలనే సందేహం కొంతమందికి కలుగుతూ వుంటుంది.

పటిక బెల్లంతో శివలింగాన్ని రూపొందించుకుని దానిని పూజించడం వలన దుఃఖాలు నశించి ... సుఖ సంతోషాలతో కూడిన జీవితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ విధంగా చేయలేని వాళ్లు చక్కెరతో శివుడిని అభిషేకించడం వలన కూడా ఆశించిన ఫలితం లభిస్తుందని చెప్పడుతోంది. అందరూ కోరుకునేది సుఖసంతోషాలతో కూడిన జీవితమే కనుక, ఆ దేవదేవుడిని ఈ విధంగా ఆరాధించి ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చు.
X

Feedback Form

Your IP address: 54.157.225.99