ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మాంగళ్యాన్ని రక్షించే మంగళగౌరి

Sun, Jul 27, 2014, 12:05 PM
Related Image సాధారణంగా ఏదైనా ముఖ్యమైన పనిపై బయలుదేరవలసి వస్తే, ఆ రోజు మంగళవారం అనే విషయం గుర్తుకు రాగానే ఆ పనిని వాయిదా వేసుకుంటూ వుంటారు. ఇక శుభకార్యాల వంటివి నిర్వహించవలసి వస్తే, మంగళవారం కాకుండా, మిగతా వారాల గురించిన ఆలోచన చేస్తుంటారు. అలాంటి మంగళవారం శ్రావణమాసంలో ఎంతో ప్రత్యేకతను .. మరెంతో విశిష్టతను సంతరించుకుని కనిపిస్తూ వుంటుంది.

వివాహమైన యువతులు .. ఆ ఏడాది వచ్చే శ్రావణమాసంలో మంగళవారాల నోము నోచుకుంటూ వుంటారు. కలకాలం తమ సౌభాగ్యాన్ని కాపాడమంటూ పార్వతీదేవిని కోరుకోవడమే ఈ నోము ప్రధాన ఉద్దేశంగా చెప్పబడుతోంది. మంగళగౌరి నోము నోచుకునే యువతులతో ... నూతన వస్త్రాలను ధరించి అక్కడికి పేరంటానికి వెళ్లే ముత్తయిదువులతో ఇళ్లు ... వీధులు కళకళలాడుతూ కనిపిస్తుంటాయి.

ఇక ఈ రోజున అమ్మవారి ఆలయాలలోను భక్తుల సందడి బాగానే వుంటుంది. ఈ నోము నోచుకునేవారు పేరంటానికి వచ్చిన ప్రతి స్త్రీని అమ్మవారిగా భావించి వాయనాలు ఇవ్వడం గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. ఈ మాసంలో మంగళగౌరిని 'గౌరమ్మ' పేరుతో ప్రేమగా పిలుచుకుంటూ వుంటారు, గౌరమ్మకి సంబంధించిన కథలు చెప్పుకుంటూ ... పాటలు పాడుకుంటూ ఆ తల్లిపట్ల మనసును నిలుపుతుంటారు.

ఇక అనుకోని కారణాల వలన వివాహమైన మొదటి సంవత్సరం 'మంగళగౌరి' నోము నోచుకోవడం కుదరకపోతే, రెండవ సంవత్సరం వదిలేసి మూడవ సంవత్సరంలోనే నోచుకోవాలనే నియమం చెప్పబడుతోంది. శ్రావణమాసంలో మంగళవారం రోజున మంగళగౌరిని పూజించడం వలన మాంగళ్యం రక్షించబడుతుంది. ఆ తల్లి అనుగ్రహంతో సౌభాగ్యం ... సంతానంతో కూడిన సంతృప్తికరమైన జీవితం లభిస్తుంది.
X

Feedback Form

Your IP address: 54.147.238.62