ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఇవి తింటున్నట్టుగా కల వస్తే ?

Thu, Jul 24, 2014, 11:49 AM
Related Image సాధారణంగా కలలనేవి అందరికీ వస్తుంటాయి. ఆయా కోరికలను బట్టి ... ఆలోచనలను బట్టి అందుకు సంబంధించిన కలలు వస్తుంటాయి. ఇక అనారోగ్యంతో వున్నప్పుడు ... ఆందోళనతో వున్నప్పుడు కూడా కలలు వస్తూ వుంటాయి. అయితే ఇలాంటి కలలు ఫలితాలను ఇవ్వవనీ ... వాటిని పరిగణలోకి తీసుకోకపోవడం జరుగుతూ వుంటుంది.

ఇక కలలు వేరుగా వచ్చినట్టే ... వాటికి సంబంధించిన ఫలితాలు కూడా వేరుగానే వుంటాయి. కొన్ని కలలు ... జరుగుతున్న సంఘటనను ప్రేక్షకులుగా చూస్తున్నట్టుగా వస్తుంటాయి. మరికొన్ని కలల్లో జరుగుతున్న దృశ్యంలో కల కనేవారు కూడా కనిపిస్తుంటారు. ఏదైనా మెలకువ వచ్చేంత వరకూ అది 'కల' అనే విషయం తెలియనంత సహజంగా వుండటం కల గొప్పతనంగా చెప్పుకోవచ్చు.

మనసులో ఎలాంటి ఆలోచన లేకుండా తెల్లవారు జామున వచ్చే కొన్ని కలలు మాత్రమే నిజమవుతూ ఉంటాయని శాస్త్రం చెబుతోంది. భవిష్యత్తులో జరగనున్న కొన్ని సంఘటనలను ముందుగా తెలియజేసే సంకేతంగా కలలు వస్తుంటాయని చెబుతుంటారు. కొన్ని కలలు రానున్న ప్రమాదాలను ... మరికొన్ని కలలు జరగనున్న శుభాలను ముందుగా తెలుపుతుంటాయి.

ఈ నేపథ్యంలో వివిధ రకాల పదార్థాలు ... పండ్లు తింటున్నట్టుగా కూడా కలలు వస్తుంటాయి. అలా బెల్లం తింటున్నట్టుగా గానీ ... మామిడి పండ్లు తింటున్నట్టుగా గాని కల వస్తే, ఎదురుచూస్తోన్న శుభసమయం దగ్గరికి వచ్చినట్టుగా అర్థం చేసుకోవాలని చెప్పబడుతోంది. ఇలా కలలో తాము బెల్లం ... మామిడి పండ్లు తింటున్నట్టుగా కనిపించడం, మనసులో గల కోరికలు త్వరలో నెరవేరతాయనే విషయాన్ని సూచిస్తాయని స్పష్టం చేయబడుతోంది.
X

Feedback Form

Your IP address: 54.205.89.199