ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఇలా చేస్తే ఈ దోషాలు తొలగిపోతాయట !

Wed, Jul 23, 2014, 03:20 PM
Related Image సాధారణంగా రాహు - కేతు దోషాలు ఉన్నట్టుగా తెలియగానే చాలామంది తీవ్రమైన ఆందోళనకు లోనవుతుంటారు. ఎందుకంటే ఆ దోషాల వలన ఎదురయ్యే పరిస్థితులు ... కలిగే ఫలితాలు అలా వుంటాయి. అందువలన ఆ దోషాల నుంచి బయటపడటానికి ఎవరికి వారు తమ స్థాయిలో ప్రయత్నించడం మొదలుపెడతారు. ఆ గ్రహాలను శాంతింపజేయడం కోసం ఆయా క్షేత్రాలను దర్శిస్తుంటారు.

రాహువునకు అధిదేవత పృథ్వీ అయితే ... కేతువునకు అధిదేవత చిత్రగుప్తుడు. రాహువు - కేతువు దోషాల వలన వ్యసనాల బారినపడటం .. నేరస్వభావం పెరిగిపోవడం ... అనారోగ్య సమస్యలు ... ఆర్ధిక ఇబ్బందులు ఎదురుకావడం జరుగుతూ వుంటుంది. ఈ దోషాలు అభివృద్ధి వైపు అడుగు వేయనీయకుండా పతనం వైపు పరుగులు తీయిస్తుంటాయి.

అలాంటి ఈ దోషాల నుంచి బయటపడాలంటే నాగేంద్రుడిని ఆవుపాలతో అభిషేకించాలని శాస్త్రం చెబుతోంది. రాహు సంబంధిత దోషాలతో బాధపడుతోన్న వాళ్లు శుక్రవారాల్లోను, కేతు గ్రహ సంబంధిత దోషాలతో ఇబ్బందులు పడుతున్నవాళ్లు మంగళవారాల్లోను నాగేంద్రుడికి ఆవుపాలతో అభిషేకిస్తూ వుండటం వలన మంచి ఫలితాలు కనిపిస్తాయని చెప్పబడుతోంది.
X

Feedback Form

Your IP address: 54.147.211.117