ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

స్వామివారికి పాదుకలు సమర్పించిన కృష్ణమ్మ

Sun, Jul 20, 2014, 11:49 AM
Related Image సాధారణంగా ఆయా క్షేత్రాల్లో కొలువుదీరిన దైవాలకు భక్తులు వివిధ కానుకలను సమర్పిస్తూ వుంటారు. భగవంతుడికి ఆ కానుకను సమర్పించి భక్తుడు ఎంతగా ఆనందిస్తూ ఉంటాడో, భక్తుడు ప్రేమతో ఇచ్చిన కానుకను స్వీకరించి భగవంతుడు అంతకన్నా ఎక్కువగా మురిసిపోతాడు.

అలా ఓ భక్తురాలు శ్రీనివాసుడికి ... అమ్మవారికి 'పాదరక్షలు' సమర్పించిందట. వాళ్లిద్దరూ ఆ పాదరక్షలు ధరించడమే కాకుండా, ఆ రోజుకి ప్రాధాన్యతను కల్పిస్తూ 'ఉద్దాల ఉత్సవం' జరిగేలా చేశారట. సాక్షాత్తు స్వామివారికీ ... అమ్మవారికి పాదరక్షలు సమర్పించిన ఆ భక్తురాలు ఎవరో కాదు, అనేక ప్రాంతాలను పవిత్రం చేస్తూ నదిగా ప్రవహించే కృష్ణమ్మే.

ఒకసారి అమ్మవారితో త కలిసి స్వామివారు ఇప్పటి ఆత్మకూరు సమీపంలో గల కృష్ణా తీరానికి చేరుకున్నాడట. ఆనందంతో ఆ దంపతులు నదిలో జలకాలాడిన అనంతరం, కృష్ణమ్మ తల్లి సంతోషంతో పొంగిపోతూ వారికి పాదరక్షలను సమర్పించిందట. స్వామివారు ... అమ్మవారు ఆ పాదరక్షలు ధరించి ప్రస్తుతం 'అమ్మపురం'గా పిలవబడుతోన్న గ్రామానికి సమీపంలో గల 'కాంచనగుహ'లో కొలువుదీరారు.

మహబూబ్ నగర్ జిల్లా 'అమ్మపురం' సమీపంలో ఈ క్షేత్రం అలరారుతోంది. కురుమూర్తి స్వామిగా ఇక్కడి శ్రీనివాసుడు పూజలు అందుకుంటూ వుంటాడు. ప్రతి సంవత్సరం 'కార్తీక శుక్ల సప్తమి' రోజున, అంటే ... లక్ష్మీశ్రీనివాసులకు కృష్ణమ్మ పాదరక్షలు ఇచ్చినట్టుగా చెప్పబడుతోన్న రోజున ఈ క్షేత్రంలో 'ఉద్దాల ఉత్సవం' నిర్వహిస్తూ వుంటారు.
X

Feedback Form

Your IP address: 54.166.48.3