ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నిదర్శనం చూపిన నరసింహస్వామి

Thu, Jul 10, 2014, 06:23 PM
Related Image సల్కునూరు గ్రామస్తులకు ... ఆ చుట్టుపక్కల ప్రజలకు ఇక్కడి నరసింహస్వామి మహిమలను గురించి తెలుసు. నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలో గల ఈ గ్రామానికి కొత్తగా వచ్చిన భక్తులకు ఆ స్వామి మహిమలు కథలు కథలుగా వినిపిస్తుంటాయి. ఆరంభం నుంచి కూడా ఈ స్వామి ఆవిష్కరిస్తోన్న లీలా విశేషాలను గురించి తెలుసుకుంటే, ఆయన ఇక్కడ ప్రత్యక్షంగా కొలువై వున్నాడనే విషయం స్పష్టమవుతూ ఉంటుంది.

ఇందుకు నిదర్శనంగా జరిగిన ఒక సంఘటను గురించి ఇక్కడ చెప్పుకోవచ్చు. నరసింహ స్వామి ఇక్కడ ఆవిర్భవించినప్పుడు ఒక వ్యక్తి ద్వారా తన జాడను గ్రామస్తులకు తెలియజేశాడు. ఆ వ్యక్తితో పాటు ఆయన తరువాత తరాలవారికి కూడా తన పూజల్లో ... సేవల్లో ప్రత్యేక స్థానం దక్కేలా చేశాడు. అయితే ఒక తరానికి సంబంధించిన వాళ్లు ఒకసారి స్వామివారి ఉత్సవాలకు ప్రాతినిథ్యం వహించలేకపోయారట.

ఆ సమయంలోనే ఆ కుటుంబీకులకు అనూహ్యమైన పరిస్థితులు ఎదురయ్యాయట. దాంతో స్వామివారు ఆగ్రహించారనే విషయం వాళ్లకి అర్థమైపోయింది. జరిగినదానికి వాళ్లు స్వామివారి సన్నిధిలో పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేశారు. ఇక ఆనాటి నుంచి ఈనాటి వరకూ కూడా వాళ్లు స్వామివారి సేవకు భంగం కలగకుండా ఆయనని సేవిస్తూ ... తరిస్తూ వస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 184.73.122.162