ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వృద్ధుడిగానే వుండమంటూ శివుడికే శాపమా?

Tue, Jul 08, 2014, 11:21 PM
Related Image శ్రీశైలం క్షేత్రంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఎన్నో అరుదైన దృశ్యాలు కనిపిస్తుంటాయి. మరెన్నో విశేషాలు స్థలపురాణంగా వినిపిస్తుంటాయి. అలా వినిపించే ఆసక్తికరమైన కథనాల్లో వృద్ధ మల్లికార్జునుడు పేరు కూడా వినిపిస్తూ వుంటుంది. ఈ వృద్ధ మల్లికార్జునుడు ప్రధాన దేవాలయ ప్రాంగణంలో ఉపాలయంలో దర్శనమిస్తూ వుంటాడు. పరమశివుడు ... వృద్ధ మల్లికార్జునస్వామిగా, అమ్మవారు భ్రమరాంబగా పిలవబడుతూ ఉండటం వెనుక ఎన్నో కథనాలు ప్రచారంలో వున్నాయి.

అయితే జానపదులు చెప్పుకునేదిగా అనిపించే ఓ కథ కూడా ఇక్కడ ప్రధానంగా వినిపిస్తూ వుంటుంది. శివపార్వతులు వేరే రూపాలలో కొండజాతి వాళ్ల సమక్షంలో వివాహమాడినట్టుగా ఈ కథ చెబుతూ వుంటుంది. శివుడిని ఆరాధిస్తూ వస్తోన్న ఓ యువతి ఆయన పట్ల ప్రేమను పెంచుకుంటుంది. ఆయనని వివాహమాడాలనే కోరికతో వున్న ఆమె, ఓ భ్రమరాన్ని అనుసరిస్తూ ఈ ప్రదేశానికి చేరుకుంటుంది.

కొండజాతి వాళ్లు ఆమెను తమ కూతురుగా భావించి చేరదీస్తారు. అలా కొంతకాలం గడిచాక ఆమె ప్రేమను పరీక్షించడం కోసం ఓ రోజున శివుడు వృద్ధుడు రూపంలో వస్తాడు. అయినా ఆయనను వివాహం చేసుకోవడానికి ఆమె అంగీకరించి అర్థాంగి అవుతుంది. అయితే ఆ సమయంలో వచ్చిన మాట పట్టింపు కారణంగా, శివుడు అక్కడి నుంచి వెళ్లిపోవడానికి సిద్ధపడతాడు.

దాంతో ఆగ్రహించిన ఆమె వృద్ధుడిగా లింగరూపంలో అక్కడే ఉంటూ పూజలు అందుకోమంటూ శపిస్తుంది. తుమ్మెదను అనుసరిస్తూ వచ్చిన కారణంగా ఆమె అక్కడ భ్రమరాంబ పేరుతో కొలువుదీరుతుంది. ఈ కారణంగానే కొండజాతి వాళ్లు అమ్మవారిని తమ కూతురిగా ... శివుడిని అల్లుడిగా భావించి పూజిస్తుంటారు. ఈ కథలో నిజానిజాల మాట ఎలా వున్నా, అది కొండజాతివారితో ఆదిదంపతులకు గల అనుబంధాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తూ వుంటుంది.
X

Feedback Form

Your IP address: 54.159.231.135