ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పరిపూర్ణ పుణ్యఫలం ఇలా దక్కుతుంది

Tue, Jul 01, 2014, 10:06 AM
Related Image తెలిసో తెలియకో చేసిన పాపాలు జీవితంలో కొన్ని ఇబ్బందులను కలిగిస్తుంటాయి. ఆర్ధికపరమైన ... ఆరోగ్యపరమైన సమస్యలు ప్రధానమై, మనశ్శాంతి లేకుండా చేస్తుంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా దైవానుగ్రహాన్ని కోరుతూ ఆయన పాదాలను ఆశ్రయిస్తుంటారు. ఇందుకోసం దగ్గరలో గల ఆలయాలకు వెళ్లి పూజాభిషేకాలు చేయిస్తుంటారు.

ఇక సమస్యలు తీవ్రరూపం దాల్చినప్పుడు ఏ దేవుడైనా తమ మొర ఆలకించకపోతాడా అని ఆయా పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ వుండటం జరుగుతుంది. మరికొందరు తమ భవిష్యత్తు ఆనందంగా ... ఆశాజనకంగా వుండాలని దైవాన్ని కోరుకునేందుకు ఆలయ దర్శనం చేస్తుంటారు. ఇలా ఒక్కొక్కరూ తమ మనసులోని మాటను భగవంతుడి చెవిన వేయడానికే ఆలయాలకి వెళుతూ వుంటారు.

మనసులోని కోరిక ఏదైనా దైవ దర్శనం కోసం వెళ్లినప్పుడు కొన్ని నియమాలను తప్పక పాటించాలి. చాలామంది నేరుగా గుడిలోకి వెళ్లి ప్రధాన దైవాన్ని దర్శించుకుని, వెంటనే బయటికి వచ్చేస్తుంటారు. అంతటితో ఆలయదర్శనమైపోయినట్టుగా భావిస్తుంటారు. ధ్వజ స్తంభాన్ని ... గర్భాలయ విమానాన్ని ... పరివార దేవతలను గాని పట్టించుకోకుండా హడావిడిగా వెనుదిరుగుతుంటారు. ఓ రకంగా ఇది పరివార దేవతలను అవమానపరచడమే అవుతుంది.

ఎప్పుడూ కూడా ఆలయంలోకి ప్రవేశిస్తూ గోపురానికి ... లోపలికి అడుగుపెట్టిన తరువాత ధ్వజ స్తంభం పైభాగానికి ... ఆ తరువాత గర్భాలయ విమానానికి నమస్కరించాలని శాస్త్రం చెబుతోంది. అలాగే ప్రధాన దైవదర్శనం అనంతరం అక్కడి ప్రాంగణంలో గల పరివార దేవతల ఆలయాలను ... మందిరాలను ప్రదక్షిణ క్రమంలో తప్పనిసరిగా దర్శించుకోవాలి. ఇక భగవంతుడి సన్నిధిలో ఉన్నంత వరకూ ఆయనపైనే దృషి పెట్టాలి. ఆయన నామాన్నే స్మరిస్తూ నమస్కరించాలి. ఆ సమయంలో తమకన్నా పైస్థాయి వాళ్లు కనిపించినా అక్కడ నమస్కరించకూడదు.

భగవంతుడి తీర్థ ప్రసాదాలు భక్తి భావంతో స్వీకరించి, దర్శనం ద్వారా లభించిన కుంకుమ .. అక్షితలను పదిలంగా ఇంట్లోని పూజా మందిరానికి చేర్చాలి. తొందరపడకుండా ... నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ఈ నియమాలను పాటించినప్పుడే ఆలయ దర్శన ఫలితం పరిపూర్ణంగా దక్కుతుందని గ్రహించాలి.
X

Feedback Form

Your IP address: 54.163.129.96