ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సొంత ఇంటి కల ఇలా నెరవేరుతుందట !

Sat, Jun 28, 2014, 04:57 PM
Related Image జీవితంలో సొంత ఇల్లు అనేది ఎవరికైనా ఒక అందమైన కలగానే కనిపిస్తూ వుంటుంది. సొంత ఇల్లు లేని వాళ్లు, ఆ కల నిజం చేసుకోవడమే తమ ముందున్న ప్రధానమైన ధ్యేయంగా భావిస్తుంటారు. అందుకోసం ఎన్ని కష్టాలనైనా ఆనందంగా భరిస్తుంటారు. సొంత ఇంటి ప్రయత్నాలకి ఆటంకాలు ఏర్పడుతోన్న ప్రతిసారి ఆ కోరిక మరింతగా బలపడుతూ వుంటుంది. ఇక ఆ భగవంతుడి అనుగ్రహం ఉంటేనే తప్ప తాము సొంత ఇల్లు కట్టుకోలేమనే నిర్ణయానికి కొంతమంది వచ్చేస్తుంటారు.

ఈ నేపథ్యంలోనే వాళ్లు పుణ్య క్షేత్రాలకి వెళ్లినప్పుడు అక్కడి దైవాలకు తమ మనసులోని మాట చెబుతుంటారు. త్వరలో తమ కోరిక నెరవేరేలా చూడమంటూ ఆయా క్షేత్రాల్లో ఒకదానిపై మరొకటిగా చిన్నచిన్న రాళ్లను పేరుస్తుంటారు. ఈ విధంగా చేయడం వలన సొంత ఇంటి కల నెరవేరుతుందని చాలామంది విశ్వసిస్తుంటారు.

తిరుమల 'మెట్లదారి'లో వెళుతూ వుండగా, దారికి రెండువైపులా ఇలా పేర్చబడిన రాళ్లు విపరీతంగా కనిపిస్తూ వుంటాయి. ఈ విశ్వాసం బలంగా వున్న క్షేత్రంగా మనకి 'ఉపమాక' కనిపిస్తుంది. విశాఖ జిల్లా నక్కపల్లి మండలం పరిధిలో ఈ క్షేత్రం అలరారుతూ వుంటుంది. ఇక్కడి గరుడాచలంపై కొలువైన స్వయంవ్యక్త వేంకటేశ్వరస్వామి మహిమాన్వితుడని చెబుతుంటారు.

స్వామిని స్మరించుకుంటూ ఈ కొండ ప్రదేశంలో ఒకదానిపై ఒకటిగా కొన్ని చిన్న చిన్న రాళ్లను పేరిస్తే, త్వరలోనే సొంత ఇంటి కల నిజమవుతుందని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు. అలా పేర్చబడిన రాళ్లను చూస్తే, ఇక్కడ ఈ విశ్వాసం ఎంత బలంగా వుందనేది అర్థమవుతుంది. భక్తుల కోరికలను స్వామి నెరవేరుస్తూ వున్నాడు గనుకనే ఈ క్షేత్రం ఇంత వైభవంతో వెలుగొందుతూ ఉందనే విషయం స్పష్టమవుతుంది.
X

Feedback Form

Your IP address: 54.158.167.137