ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

భగవంతుడే తగిన మార్గాన్ని చూపిస్తాడు

Wed, Jun 25, 2014, 02:41 PM
Related Image ప్రశాంతమైన వాతావరణంలో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటుచేసుకుని, తన భార్య పద్మావతితో కలిసి రాధాకృష్ణుల రమణీయ కథామృతాన్ని గానం చేస్తుంటాడు జయదేవుడు. మనసును మంత్రించే ఆ గీతాలను వింటూ అక్కడి ప్రజలు పరవశించిపోతుంటారు. ఒక రోజున జయదేవుడి ఆశ్రమంలోకి అడుగుపెట్టిన ఒక సాధువు, ఆయన గీతాలను వింటూ తనని తాను మరిచిపోయి అక్కడే కూర్చుండిపోతాడు.

అలా కొంత సమయం గడిచాక ఆశ్రమం బయటికి వచ్చిన జయదేవుడు, పారవశ్యంలో వున్న ఆ సాధువును చూసి ఆశ్చర్యపోతాడు. జయదేవుడి పిలుపుతో ఈ లోకంలోకి వచ్చిన ఆ సాధువు, ఆయన గీతాలలోని గొప్పతనాన్ని గురించి ప్రస్తావిస్తాడు. సాధారణ జనుల మనసులలోనే కాదు ... సాక్షాత్తు ఆ గోవిందుడి హృదయంలో సైతం ఆ గీతాలకు శాశ్వత స్థానం లభిస్తుందని అంటాడు. త్వరలోనే ఆయన రచనలకు తగిన గుర్తింపు ... గౌరవం లభిస్తాయని చెప్పి వెళ్లిపోతాడు.

ఆ రూపంలో వచ్చినది కృష్ణుడేనని ఆ సమయంలో జయదేవుడు గ్రహించలేకపోతాడు. పూరీ జగన్నాథస్వామి ఆలయ పరిసరప్రాంతాల్లో ఆ స్వామి సాధువు రూపంలోనే సంచరిస్తూ, జయదేవుడు రాసిన గీతాలను పాడటం మొదలుపెడతాడు. ఆ గీతాల పట్ల అక్కడి ప్రజలు విశేషంగా ఆకర్షితులవుతారు. ఈ విషయం పూరీ రాజుగారి వరకూ వెళ్లడంతో, ఆయన జయదేవుడిని తన ఆస్థానానికి పిలిపిస్తాడు.

ఆరంభంలో జయదేవుడి సాహిత్యం పట్ల ఆ రాజు అసూయను ప్రదర్శించినా, ఆ తరువాత ఆయన రచనల్లోని గొప్పతనాన్ని అంగీకరిస్తాడు. అలా అక్కడి నుంచి ఆ నోటా ఈనోటా మిగతా రాజ్యాలకు కూడా జయదేవుడి గీతాలు విస్తృతంగా వ్యాపిస్తాయి. ఆయనకి నవద్వీప మహారాజు ఆస్థానంలో ఉన్నతమైన స్థానాన్ని కల్పిస్తాయి.
X

Feedback Form

Your IP address: 54.87.119.171