ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆయన కనిపించకపోతే కరవు కాటకాలే !

Mon, Jun 09, 2014, 12:06 PM
Related Image ఆదిదేవుడు ఎక్కడ కొలువుదీరినా ఆయన ఎదురుగా నందీశ్వరుడు దర్శనమిస్తూ వుంటాడు. స్వామివారి ఆదేశం కోసం ... ఆయన సేవ కోసం ఆరాటంతో ఎదురుచూస్తున్నట్టుగా కనిపిస్తుంటాడు. తాను ఏ క్షేత్రంలో వుంటే ఆ క్షేత్రాన్ని స్వామివారితో సమానంగా సంరక్షిస్తూ వుంటాడు. స్వామివారి కోరిక మేరకు ఆయన భక్తులను ఆదుకుంటూ వుంటాడు.

ఈ కారణంగానే స్వామివారితో పాటు సమానంగా ఆయన పూజలు అందుకుంటూ వుంటాడు. అలాంటి విశిష్టమైన క్షేత్రాల్లో ఒకటిగా 'పాతపట్నం' దర్శనమిస్తుంది. శ్రీకాకుళం జిల్లాలోని ఈ క్షేత్రంలో పరమశివుడు కొలువై, తన దర్శనం కోరివచ్చిన భక్తులను అనుగ్రహిస్తుంటాడు. ఇక్కడి పంచలోహ 'నందీశ్వరుడు' మహిమాన్వితుడని భక్తులు చెబుతుంటారు. యాభై కేజీలకుపైగా బరువుండే ఈ పంచలోహ విగ్రహాన్ని ఒకసారి దొంగలు దోచుకుని వెళ్లారు.

ఆలయంలో గల విగ్రహం మాయమైన దగ్గర నుంచి ఈ ప్రాంతంలో కరవు కాటకాలు ఏర్పడ్డాయి. వర్షాలు కురవక పోవడానికి కారణం నందీశ్వరుడు ఆలయానికి దూరం కావడమేనని గ్రామస్తులు గ్రహించారు. ఎలాగైనా ఆ విగ్రహాన్ని దక్కించుకోవాలనే ఉద్దేశంతో దానిని అన్వేషించడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ... దొంగలు మోయలేక నదీ తీరంలో దాచిన విగ్రహం బయటపడింది.

గ్రామస్తులు ఆ విగ్రహాన్ని ఊరేగింపుగా ఆలయానికి తీసుకుని వచ్చి యథాస్థానంలో ఉంచారు. అంతే ఆ క్షణమే ఆ ప్రాంతంలో భారీగా వర్షం కురిసింది. అనతికాలంలోనే పాడి పంటలు వృద్ధి చెందాయి. మహిమాన్వితమైన ఈ సంఘటన గురించి ఇప్పటికీ కూడా భక్తులు కథలు కథలుగా చెప్పుకుంటూ వుంటారు. నందీశ్వరుడు ఇక్కడ ప్రత్యక్షంగా కొలువై వున్నాడని బలంగా విశ్వసిస్తూ అంకిత భావంతో పూజలు జరిపిస్తుంటారు.
X

Feedback Form

Your IP address: 54.158.84.38